AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Diet: వర్షాకాలంలో పొరబాటున కూడా ఈ ఆహారాల జోలికి వెళ్లకండి.. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడతారు

సగటు మధ్య తరగతి ఇంట్లో సమయానికి కూరగాయలు లేకపోయినా పప్పు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారికి శరీరంలోని ప్రొటీన్ల లోపాన్ని తీర్చే ఏకైక మార్గం పప్పు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారంలో వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు..

Srilakshmi C
|

Updated on: Jul 16, 2024 | 1:01 PM

Share
సగటు మధ్య తరగతి ఇంట్లో సమయానికి కూరగాయలు లేకపోయినా పప్పు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారికి శరీరంలోని ప్రొటీన్ల లోపాన్ని తీర్చే ఏకైక మార్గం పప్పు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారంలో వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

1 / 5
పప్పులు పోషకాలతో నిండి ఉంటాయి. ప్రొటీన్, పీచుతో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ వంటి వివిధ మినరల్స్‌ పప్పులలో లభిస్తాయి. పప్పులు తినడం వల్ల శరీరంలో పోషకాహార లోపం తలెత్తదు. పప్పులు తింటే ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదు. కానీ వర్షాకాలంలో మాత్రం వీటిని తినకూడదు. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ కింది 3 రకాల పప్పులు అస్సలు ముట్టుకోకూడదు.

2 / 5
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సంభవించవచ్చు. కంది పప్పు తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో పీచుపదార్థం పెరిగితే అజీర్తి సమస్య వస్తుంది. కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. శరీరంలో అసౌకర్యం ఏర్పడుతుంది.

3 / 5
రాజ్మాను బాగా ఉడకబెట్టి తినకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ పప్పులలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, కాపర్, పొటాషియం ఉంటాయి. వర్షాకాలంలో రాజ్మా తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది.

4 / 5
చాలా మంది శనగలు ఉడికించి, లేదంటే మొలకెత్తించి తినడానికి ఇష్టపడతారు. వర్షాకాలంలో ఈ పప్పు తినకపోవడమే మంచిది. శనగలు లాభదాయకంగా ఉన్నప్పటికీ, ఈ సీజన్లో వాటిని తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి.

5 / 5