
వేసవి కాలంలో చాలా రకాల చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేసినా కూడా చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. చెమట కారణంగా ఫంగల్, బ్యాక్టీరియా పెరిగిపోయి ఇన్ ఫెక్షన్స్ పెరుగుతాయి. దీని వల్ల దుర్వాసన, దురద, దద్దర్లు, ర్యాషెస్ వస్తాయి. అయితే వీటన్నింటినీ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.

మీరు స్నానం చేసే ముందు నీటిలో కొద్దిగా పాలు వేయండి. పాలు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం రంగు మారుతుంది. ఫ్రెష్‌గా అనే ఫీల్ కూడా ఉంటుంది. అంతే కాకుండా దుర్వాసన, దద్దర్లు, దురద వంటివి కూడా తగ్గుతాయి.

పసుపులో కూడా అనేక రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి. పసుపు నీటిలో వేసి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీరు స్నానం చేసే బకెట్ నీటిలో కొద్దిగా పసుపు కలిపి.. స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తే దురద, దుర్వాసన కూడా తగ్గుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా స్నానం చేయవచ్చు. మీరు స్నానం చేసే నీటిలో ఓ కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ ను వేసి బాగా కలపండి. ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల దద్దుర్లు, దురద, దుర్వాసన తగ్గుతాయి.

మీరు స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్ కలిపి స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దురద, దుర్వాసన అనేవి తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. బ్యాక్టీరియా చర్మం పైన చేరకుండా ఉంటుంది.