
Miss Teen Andhra Pradesh- 2023: ఉమ్మడి విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువతి మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్- 2023 టైటిల్‌ను కైవసం చేసుకుంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామానికి చెందిన పండూరి యశస్విని మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్- 2023 టైటిల్ విజేతగా నిలిచింది. విశాఖకు చెందిన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ఆధ్వర్యంలో మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్- 2023 పోటీలు నగరంలో జరిగాయి.

పలు దశలుగా జరిగిన ఈ పోటీల్లో తొలుత స్టార్ కిడ్స్- 2023, స్టార్ ఆంధ్రప్రదేశ్- 2023 ఫ్యాషన్ షో గ్రాండ్ ఫినాలేకు రెండు విభాగాల్లో రాష్ట్రం నలువైపుల నుంచి పలువురు మహిళలు, చిన్నారులు హాజరయ్యారు. వివిధ దశల్లో ఈ పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. వీరిలో కొంతమందే ఫైనల్ కు చేరారు..

ఈ పోటీలకు అతిధులుగా, న్యాయనిర్ణేతలుగా బిగ్‌బాస్ ఫేమ్ అనిల్ రాథోడ్, న్యాయ నిర్ణేతగా మిస్టర్ ఒలింపియా అరుణ్ పాల్, మిస్ ఇండియా 2022 సంతోషిని హాజరయ్యారు. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చూపిన యశస్వినిని న్యాయనిర్ణేతలు విజేతగా ప్రకటించారు. అనంతరం అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు.

స్టార్ ఆంధ్రప్రదేశ్ సీజన్ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది ఆడిషన్స్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపినట్టు తెలిపిన నిర్వాహకులు తెలిపారు. వీరిలో 68 మంది మాత్రమే ఎంపిక చేసినట్లు వివరించారు.

ఏటా ఈ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా.. ఈ పోటీలను తిలకించేందుకు విశాఖపట్నం వాసులతోపాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.