AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: గ్రహాల రాకుమారుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం! మీ రాశి ఇదేనా..?

Mercury Nakshatra Transit 2026 Telugu: సెప్టెంబర్ 21న బుధుడు చిత్తిరై నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. కుజుడి అధీనంలోని ఈ నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల వృషభం, మిథునం, కన్య, మకర రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య విశ్వాసం.

Rajashekher G
|

Updated on: Sep 21, 2026 | 8:57 PM

Share
Mercury Nakshatra Transit 2026 Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడుగా పరిగణిస్తారు. తెలివితేటలు, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, లెక్కలు, కమ్యూనికేషన్ వంటి అంశాలకు బుధుడు కారకుడిగా చెబుతారు. బుధుడు ఒక రాశిలో సుమారు 21 రోజుల పాటు సంచరిస్తూ, ఈ క్రమంలో నక్షత్రాలను కూడా మారుస్తుంటాడు. బుధుడి రాశి లేదా నక్షత్ర మార్పు ప్రభావం అన్ని రాశులపై ఏదో ఒక విధంగా ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం. ప్రస్తుతం బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 21న బుధుడు చిత్తిరై నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. చిత్తిరై నక్షత్రానికి అధిపతి కుజుడు. జ్యోతిషశాస్త్రంలో కుజుడు ధైర్యం, శక్తి, పరాక్రమం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. దీంతో బుధుడి నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి వృత్తి, ఆర్థిక, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలను తీసుకురావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ కాలం ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది.

1 / 5
వృషభ రాశి.. బుధుడి నక్షత్ర మార్పుతో వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. చాలాకాలంగా ఎదురవుతున్న కార్యాలయ సమస్యలు పరిష్కారం కావచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులు కలిసి రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

2 / 5
మిథున రాశి.. ఈ నక్షత్ర మార్పు మిథున రాశి వారికి ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని జ్యోతిష్య నమ్మకం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు అనుకూల అవకాశాలు లభించవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం కూడా పెరగవచ్చు.

3 / 5
కన్యారాశి.. బుధుడు స్వరాశిలో ఉండటంతో కన్యారాశి వారికి ఈ మార్పు ప్రత్యేకంగా ఉండవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహకారం లభించవచ్చు. వ్యాపారులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గవచ్చు. వ్యక్తిగత జీవితంలోనూ సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

4 / 5
మకర రాశి.. ఈ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు కొత్త అవకాశాలను పరిశీలించవచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలతో పాటు చాలాకాలంగా నెరవేరని కొన్ని కోరికలు సాకారమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం.

(Disclaimer: ఈ కథనంలో తెలిపిన ఫలితాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన ఫలితాలుగా పరిగణించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మకర రాశి.. ఈ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు కొత్త అవకాశాలను పరిశీలించవచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలతో పాటు చాలాకాలంగా నెరవేరని కొన్ని కోరికలు సాకారమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. (Disclaimer: ఈ కథనంలో తెలిపిన ఫలితాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన ఫలితాలుగా పరిగణించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us