AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Menthikura Pachadi: చేదు లేకుండా కమ్మనైన మెంతికూర టమాటా రోటి పచ్చడి

ఆకుకూరల్లో మెంతికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే దీనిలో ఉండే సహజ చేదుదనం వల్ల చాలామంది, ముఖ్యంగా పిల్లలు మెంతికూర పప్పు లేదా కూరలను తినడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఏమాత్రం చేదు తెలియకుండా, నాలుకకు చురుకు పుట్టించేలా పుల్లపుల్లగా, కారంగా 'మెంతికూర టమాటా రోటి పచ్చడి' చేస్తే ఆకలి లేదనే వారు కూడా ఒకటికి రెండు ముద్దలు ఎక్కువగానే లాగించేస్తారు. 

Phani CH
|

Updated on: Oct 15, 2026 | 6:53 PM

Share
కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి ఆకులు వేరుచేసిన 1 పెద్ద కట్ట తాజా మెంతికూర, ముక్కలుగా తరిగిన 4 మీడియం సైజు బాగా పండిన టమాటాలు, 9 నుండి 10 పచ్చిమిరపకాయలు, 4 నుండి 5 ఎండు మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కల్లుప్పు, పోపు దినుసులు, 1 రెమ్మ కరివేపాకు, సరిపడా వంట నూనె 

1 / 5
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి 4-5 ఎండుమిర్చి, 9-10 పచ్చిమిర్చి వేసి మాడిపోకుండా వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఒక కట్ట మెంతికూరను వేయాలి. మీడియం మంటపై మెంతికూరలోని పచ్చివాసన, తేమ పూర్తిగా ఆవిరైపోయే వరకు 2 నిమిషాలు వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

2 / 5
అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగాక తరిగిన 4 టమాటా ముక్కలు, ఉసిరికాయ సైజు చింతపండు వేయాలి. మీడియం ఫ్లేమ్‌పై గరిటెతో కలుపుతూ టమాటాలు మెత్తగా గుజ్జులా మారే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

3 / 5
ముందుగా మిక్సీ జార్‌లో ఉన్న చల్లారిన మెంతికూర-మిర్చి మిశ్రమంలో 4 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. మిక్సీని ఆపుతూ ఆపుతూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్‌లా చేయకూడదు. ఇప్పుడు ఇందులోనే చల్లారిన టమాటా-చింతపండు గుజ్జు, రుచికి సరిపడా కల్లుప్పు వేసి.. రోట్లో రుబ్బిన టెక్స్చర్ వచ్చేలా కాస్త పలుకుగా మిక్సీ పట్టి బౌల్‌లోకి తీసుకోవాలి.

4 / 5
చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు, దంచిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, తుంచిన 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వెల్లుల్లి ఎర్రబడే వరకు వేయించాలి. ఈ సువాసనభరితమైన తాలింపును పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నోరూరించే కమ్మనైన 'మెంతికూర టమాటా రోటి పచ్చడి' సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటుంటే చేదు అస్సలు తెలియకుండా అమృతతుల్యంగా ఉంటుంది!

5 / 5
Follow Us