Men Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకే కాదు.. పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు
మారుతున్న జీవన శైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్‌లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. దీంతో రొమ్ము భాగంలో ఏ మాత్రం గట్టిగా తగిలినా మహిళలు హడలెత్తిపోతుంటారు. చాలా మంది రొమ్ము క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందని అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ మహిళలకే కాదు పురుషులకు కూడా వస్తుంది. పురుషులలో రొమ్ము కణజాలం తక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే అది కూడా ప్రమాదకరమే..