
మనం రోజూ తినే కూరగాయల్లో బెండ కాయ కూడా ఒకటి. వారంలో ఒక్కసారైనా బెండకాయను తింటూ ఉంటారు. ఫ్రెష్ కూరగాయలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బెండకాయ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. బెండ కాయ తింటే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బెండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

బెండకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. లేడీ ఫింగర్ తినడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు క్యాన్సర్ ను తగ్గించే ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. బెండ కాయలోని ఫైబర్.. పెక్టిన్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

ప్రెగ్నెంట్ లేడీస్ బెండకాయను తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి.. అనారోగ్య సమస్యలు రాకుండా, ఇమ్యూనిటీని పెంచుతుంది. బెండకాయ తింటే జీర్ణ క్రియ శక్తి కూడా పెరుగుతుంది.

లేడీ ఫింగర్ తింటే తిన్న ఆహారం తిన్నట్టు జీర్ణం అవుతుంది. దీంతో గ్యాస్, కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. బెండకాయలో ఉండే జిగురు వలన కీళ్ల నొప్పులు త్వరగా రాకుండా ఉంటాయి. అలాగే బెండ కాయలో ఉండే విటమిన్ కే.. రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. అలాగే ఎముకలను స్ట్రాంగ్ గా తయారు చేస్తుంది.

లేడీ ఫింగర్ తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. బెండ కాయలో ఉండే ప్రోటీన్ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఇలా బెండకాయ తినడం వల్ల అనేక సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.