
కావాల్సిన పదార్ధాలు: రొయ్యలు – 20 బఠాణీ గింజలు – 100 గ్రాములు గుడ్లు – 3 కారం మిరియాల పొడి సోయాసాస్ ఒక టీ స్పూన్ నువ్వుల నూనె కొత్తిమీర తురుము పుదీనా తురుము ఉల్లికాడలు ఉప్పు రుచికి తగినంత

రొయ్యలను శుభ్రం చేసుకుని లైట్‌గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వాటిని ఉడికించుకోవాలి. పచ్చి బఠానీలను కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక గిన్నె తీసుకుని గుడ్లు, చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, అర టీ స్పూన్ సోయాసాస్ వేసుకుని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. అనంతరం స్టౌ వెలిగించి బాణలి పెట్టుకుని వేడి ఎక్కిన తర్వాత కొంచెం నువ్వుల నూనె వేసుకుని ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

అందులో ఉడికించి పక్కనపెట్టుకున్న బఠాణీలు వేసుకుని కొంచెం సేపు వేయించాలి. తర్వాత ఉడికించుకున్న రొయ్యలను వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఈ రొయ్యల మిశ్రమాన్ని వేరే బౌల్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.

అదే బాణలిలో కొంచెం నూనె వేసుకుని ముందుగా కలిసి ఉంచుకున్న గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసుకుని.. దానిపైన రొయ్యల–బఠాణీ మిశ్రమాన్ని పరచుకోవాలి. కొంచెం సేపు వేగనిచ్చి.. మళ్ళీ దానిని తిరగవేసి వేయించుకోవాలి.

అంతే రొయ్యలు ఆమ్లెట్‌ని జాగ్రత్తగా ప్లేట్‌లోకి తీసుకుని.. గార్నిష్ కోసం కొద్దిగా నూనె, మిగిలిన సోయాసాస్ వేసుకుని కొత్తిమీర, పుదీనా తురుముని వేసుకుంటే.. టేస్టీ టేస్టీ రొయ్యల ఆమ్లెట్ రెడీ.. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.