Rewind 2025: 2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!

Updated on: Dec 26, 2025 | 9:39 AM

Telangana Major Accidents 2025: 2025.. ఈ ఏడాది మరో నాలుగు రోజుల్లో ముగిసిపోతుంది. కానీ ఈ ఏడాది మిగిల్చిన తీవ్ర విషాదాలను మర్చిపోవడం మాత్రం అంత సులువుకాదు. ఎందుకంటే కేవలం 2025 ఒక్క ఏడాదిలోనే, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమదాలు, ఇతర ప్రమాదాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 100కుపైగా మరణాలు సంభవించాయి. ఇవి ఎన్నో కుటుంబాలను రోడ్డు పడేశాయి. ఎందరో తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చాయి. మొత్తం 2025లో ఎక్కడ ఏఏ ప్రమాదాలు జరిగాయో ఒక్కసారి చూద్దాం పదండి.

1 / 5
2025 ఏడాదిలో తెలంగాణనే కాదు యావత్‌ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన మొదటి ప్రమాదం సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు, పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలుడం కారణంగా సుమారు 40 మందికిపై కార్మికులు మరణించారు. ఇందులో కొందరు కార్మికలు అక్కడికక్కడే మంటల్లో సజీవదహనం అయ్యారు. కొంతమంది కనీసం మృతదేహాలు కూడా లభించలేదు. వీరిలో చాలా వరకు వలస కూలీలే ఉన్నారు. అలాగే  ఈప్రమాదంలో మరో 33 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వ పరిహారం కూడా ప్రకటించింది. ఇది 2025లో తెలంగాణలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నమోదైంది.

2 / 5
ఇక ఈ ఏడాదిలో జరిగిన మరో ఘోర ప్రమాదం. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్న గుల్జార్ హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదం. ఇది కూడా యావత్తు తెలంగాణను  దిగ్బ్రాంతి గురిచేసిన గటన. ఈ ప్రమాదం మే 18వ తేదీని తెల్లవారుజామున జరిగింది.హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌజ్‌లో తెల్లవారు జామున మంటలు చెలరేగి సుమారు 17 మంది సజీవ దహనం అయ్యారు.ఈ ప్రమాదంలో మరణించిన వారికిలో చిన్నారు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

3 / 5
ఇక తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన మరో ఘోర ప్రమాదం. నవంబర్ 3వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం. హైదరాబాద్‌ నుంచి తాండూరు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును హైదరాబాద్-బీజాపూర్ హైవేపై  గ్రావెల్ లోడెడ్ టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 19-20 మంది అక్కడికక్కడే మరణించారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో  చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.

4 / 5
తెలంగాణలో జరిగిన మరో ప్రమాదం అడిలాబాద్ ప్రైవేట్ బస్సు ప్రమాదం, అడిలాబాద్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ  ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఇది కూడా రాష్ట్రంలో బస్సు ప్రమాదాల శ్రేణిలో భాగమైంది. అలాగే భద్రాచంలో నిర్మాణంలోని భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.

5 / 5
ఇక మొత్తానికి ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి, మొత్తం అగ్నిప్రమాదాల్లో 160పై మరణాలు సంభవించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 7,333 రోడ్డు ప్రమాదాల్లో  2,702 మంది మరణించగా, 8,118 మంది గాయపడినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనలు రోడ్డు భద్రత, పారిశ్రామిక భద్రతపై మరింత శ్రద్ధ అవసరమని తెలియజేస్తున్నాయి.