Wine Capital Nashik: భారతదేశంలోని ఈ నగరానికి మరో పేరు ‘వైన్ క్యాపిటల్‌ సిటీ’.. ఇక్కడ మద్యం వెరీ ప్యూర్‌..!

|

Jul 28, 2023 | 1:10 PM

ఈ నగరాన్ని వైన్ తయారీ కేంద్రంగా, భారతదేశ వైన్‌ రాజధానిగా పిలుస్తారు. ఎందుకంటే దేశంలోని ప్రముఖ వైన్ బ్రాండ్‌లలో ఒకటైన సులా 1999లో ఇక్కడ ఏర్పాటైన అతిపెద్ద వైన్‌యార్డ్‌ను స్థాపించింది. ఇక్కడ 8000 ఎకరాల్లో ద్రాక్ష సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20 టన్నుల ద్రాక్ష ఉత్పత్తి అవుతుంది.

1 / 5
నాసిక్.. ఇది మహారాష్ట్రలోని ఒక పవిత్ర నగరం. ఇక్కడ ద్రాక్ష పంట పుష్కలంగా పండుతుంది. కొండ భూభాగం సంపూర్ణ స్థిరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు..ఈ  నగరాన్ని వైన్ తయారీ కేంద్రంగా, భారతదేశ వైన్‌ రాజధానిగా పిలుస్తారు. భారతదేశంలోని ప్రముఖ వైన్ బ్రాండ్‌లలో ఒకటైన సులా 1999లో నాసిక్‌లో అతిపెద్ద వైన్‌యార్డ్‌ను స్థాపించింది.

2 / 5
భారతదేశంలోని 46 వైన్ తయారీ కేంద్రాలలో 22 నాసిక్‌లో ఉన్నాయి. మిగిలినవి హైదరాబాద్, కాశ్మీర్‌తో పాటుగా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరించాయి.  వ్యాపార పరంగా, సెలవులను ఎంజాయ్‌ చేయటానికి యాత్రికులు నాసిక్‌లోని అనేక ద్రాక్షతోటలను చూసేందుకు కూడా ఇక్కడకు వస్తారు.

3 / 5
రాజీవ్ సామంత్ ద్వారా స్థాపించబడిన సులా నగరం భారతదేశంలో అగ్రశ్రేణి వైన్ ఉత్పత్తి నగరంగా మారింది. మీరు జనవరి, ఏప్రిల్ మధ్య నగరాన్ని సందర్శిస్తే ఇక్కడి వాతావరణ మంతా ద్రాక్ష సువాసనతో నిండిపోయి మీకు స్వాగతం పలుకుతుంది.

4 / 5
 నాసిక్‌లోని 180,000 ఎకరాల వ్యవసాయ భూమిలో, 8,000 ఎకరాలు వైన్ ద్రాక్ష సాగు చేస్తుంటారు.ఇక్కడ తయారైన వైన్ 20-గ్రేడ్ స్కేల్‌లో 13 నుండి 17 మధ్య స్కోర్ చేస్తుంది. అవి అధిక ఎత్తులో ఉత్పత్తి చేయబడినందున ద్రాక్ష రుచి, నాణ్యతలో టాప్‌లో నిలుస్తుంది.

5 / 5
పచ్చని ద్రాక్ష పొలాలే కాకుండా, ఇక్కడి ఎస్టేట్‌ అందాలు కూడా సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రకృతిలో ఒడిలో చేసే వాకింగ్‌, సైక్లింగ్, స్పా చికిత్సలు అలాగే VIP వైన్ టూర్‌లను ఎంజాయ్‌ చెయొచ్చు.