Lung Cancer: వీరికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రమాదం మరింత ఎక్కువ.. బీ అలర్ట్‌ బ్రో!

|

Dec 04, 2024 | 1:20 PM

ప్రాణాంతక వ్యాధులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. ధూమపానం చేసేవారితోపాటు ఆ అలవాటు లేనివారిలో కూడా ఈ విధమైన క్యాన్సర్ వాటిల్లడం అత్యంత దురదృష్టకర పరిణామం. దీనిని నివారించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం అవసరం..

1 / 5
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. ఇది సాధారణంగా శ్వాసకోశ కణాలలో వ్యాపిస్తుంది. అక్కడి నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కలిగే ప్రమాదాలు, దానిని నివారించే మార్గాల గురించి నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

2 / 5
డాక్టర్ ఆదిత్య విదుషి ఏం చెబుతున్నారంటే.. సిగరెట్, బీడీ వంటి ధూమపానం అలవాట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సాధారణ కారణం. ధూమపానం చేయని వారితో పోలిస్తే ధూమపానం చేసేవారికి 20 రెట్లు ప్రమాదం ఉంది. ధూమపానం మానేయడం వల్ల ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. కౌన్సెలింగ్, నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, కొన్ని యాంటీ-క్రావింగ్ మందులు ధూమపానం చేసేవారిలో శాశ్వతంగా అలవాటు మానేయడానికి సహాయపడుతుంది.

3 / 5
సెకండ్ హ్యాండ్ పొగకు గురికావడం కూడా మరో కారణం. దీనిని పాసివ్ స్మోకింగ్ అని కూడా అంటారు. బహికంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేవారికి దూరంగా ఉండాలి.

4 / 5
ప్రజారోగ్యం,ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వాయు కాలుష్యం మరో ముఖ్యమైన కారణం. వాహనాలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించడం, గాలి నాణ్యత తక్కువగా ఉన్న సమయంలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి.

5 / 5
LDCTని ఉపయోగించి ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి నయం చేయడంలో సహాయపడుతుంది. ధూమపానం చేసే 55-75 సంవత్సరాల వయస్సు గల పురుషులు స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా అవసరం. తద్వారా సకాలంలో దీనిని గుర్తించి చికిత్స చేయడానికి అవకాశం ఉంటుందని క్యాన్సర్ నిపుణులు అంటున్నారు.