Period Cramps Remedies: పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!

|

Aug 05, 2024 | 4:07 PM

ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీ కడుపులో పడనిదే పని మొదలుపెట్ట బుద్ది కాదు. ముఖ్యంగా ఆడవాళ్లు వంటపని, ఇంటి పని ప్రారంభించేకంటే..ముందు.. కప్పు కాఫీయో, టీగానీ తప్పక తాగేస్తుంటారు. వేడి వేడిగా టీ తాగుతుంటే.. ఎంతో రిఫ్రెష్‌గా ఫీలవుతుంటారు. అయితే, ఒకప్పుడు టీ, పాలు మిక్సింగ్ చేసిన టీనే ఎక్కువ తాగేవారు. కానీ, ఇప్పుడు ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిపోయింది. పాలు, టీతో చేసిన టీ అనారోగ్యానికి దారి తీస్తుందని తెలిసి ఈ మధ్య కాలంలో హెల్త్ టీలు ట్రై చేస్తున్నారు.

1 / 6
గ్రీన్ టీ, శంఖు పూల టీ, తులసి టీ, లెమన్ టీ, అల్లంటీ, మందారం, గులాబీ పువ్వులతో చేసిన టీలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అలాంటిదే ఇప్పుడు కొత్తగా మరో టీ అందుబాటులోకి వచ్చింది. అదే లోటస్ టీ. అవును మీరు విన్నది నిజమే.. తామర పూల టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

2 / 6
ఆయుర్వేదం ప్రకారం.. తామర పువ్వులో ఎన్నో ఖనిజాలు, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ నిండి ఉన్నాయి. అందుకే, ఇప్పుడు చాలా మంది కొత్తగా తామర పూలతో తయారు చేసిన టీని ట్రై చేస్తున్నారు. గ్రీన్‌ టీ మాదిరిగా తామరపువ్వుల రేకులతో టీ తయారు చేసుకుని తాగితే గ్యాస్ట్రిక్‌ అల్సర్లు తగ్గడంతోపాటు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

3 / 6
తామర ఆకుల్లోనూ బోలెడు పోషకాలున్నాయి.. తామర కాడల్లోనూ సి-విటమిన్‌ ఎక్కువ. తామర దుంపల్ని ఉడికించి తిన్నా, సూపులా తీసుకున్నా రక్తహీనత తగ్గుతుంది. తామర గింజల్లో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్-ఇ సమృద్ధిగా లభిస్తాయి. గింజల్లోని పాలీఫినాల్స్ మధుమేహ నియంత్రణకు తోడ్పడతుతాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందట.

4 / 6
ముఖ్యంగా మహిళలకు పీరియడ్స్  సమయంలో వచ్చే నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు పోసి.. అందులో నాలుగు తామరాకు రెమ్మలు వేసి మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది. తామర పువ్వులో ఉండే అపోమోర్ఫిన్ , న్యూసిఫెరిన్ అనే పోషకాలు ఒత్తిడి, నిరాశ, ఆందోళనను తగ్గిస్తాయి.

5 / 6
అంతేకాదు, ఈ టీతో  జ్వరం, తలనొప్పి, చికాకు వంటి సమస్యలను నివారిస్తుంది.  తామర పువ్వులో ఉండే విటమిన్ బి, సి, ఐరన్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట. శరీరంలో ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి ఈ టీ ఎంతో తోడ్పడుతుంది. హైబీపీని కంట్రోల్ చేస్తుంది. మృదువైన చర్మసౌందర్యం కోసం తామర గింజలు, పువ్వుల రేకుల పౌడర్‍‌ను వాడుతారు.

6 / 6
అలాగే, తామర పువ్వుల తైలం మెలనిన్‌ ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా తెల్లజుట్టుని నిరోధిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  
గింజల్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి పంచదార కలిపి తాగితే డయేరియా తగ్గుతుందట. గింజల్ని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పూలను కూడా డయేరియా, కలరా, జ్వరాలు తగ్గడానికి వాడతారు.

అలాగే, తామర పువ్వుల తైలం మెలనిన్‌ ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా తెల్లజుట్టుని నిరోధిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. గింజల్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి పంచదార కలిపి తాగితే డయేరియా తగ్గుతుందట. గింజల్ని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పూలను కూడా డయేరియా, కలరా, జ్వరాలు తగ్గడానికి వాడతారు.