వెయ్యినూతుల కోన అద్భుత క్షేత్రం..నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపచేసింది ఇక్కడే

| Edited By: Jyothi Gadda

Dec 07, 2024 | 9:03 PM

హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని నారసింహ స్వామి చంపిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే చంపే ముందు విష్ణు మూర్తి సగం మనిషిగా సగం జంతువుగా మారి నరసింహ స్వామి ఆవతారంలో ఉగ్రరూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని తన చేతిగోళ్ళతో పొట్ట చీల్చి చంపేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన కథే.. అయితే ఆ ఉగ్రరూరం చల్లార్చడానికి దేవతలంతా కలిసి వెయ్యి నూతులలో నీటితో ఆయనను శాంత పరిచారంట .. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే .

1 / 5
అహోబిలంలో నరసింహ స్వామి అవతారంలో ఉగ్రరూరంలో హిరణ్యకశిపుని చంపిన తరువాత తన ఉగిర రూపాన్ని చల్లర్చడానికి దేవకలంతా కలిసి వెయ్యి నూతులలో నీటితో ఆయనకు అభిషేకం చేస్తే కానీ ఆ రూరం చల్లబడలేదంట.. ఆ వెయ్యు నూతులు ఎక్కడో ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
కడప జిల్లా లోని కమలాపురం నియోజకవర్గం పెండ్లి మర్రి ప్రాంతంలోని వెయ్యి నూతుల కోన ప్రాంతానికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. నరసింహా స్వామి వారు హిరణ్యకశిపుడిని వధించి కొండప్రాంతం అయిన ఈ క్షేత్రానికి రావడం జరిగిందని చెబుతారు. అప్పుడు దేవతలంతా స్వామి వారి ఉగ్ర రూపాన్ని చల్లబరచాలంటే ఏం చేయాలో అర్థం కాలేదట. చివరకు కొండ పరిసర ప్రాంతంలో వెయ్యి బావులను సృష్టించారట.

3 / 5
అనంతరం ఆ బావులలోని నీటిని తీసుకువచ్చి స్వామివారి మీద పోస్తూ అభిషేకించారంట. ఆ తరువాత గాని ఉగ్రరూపుడైన నరసింహస్వామి చల్లబడలేదని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి .  అంతేకాక ఆయన అక్కడ స్వయంభువుగా వెలిశారని భక్తుల విశ్వాసం.

4 / 5
స్వామి వారు కృతయుగములో ఉద్భవించడం జరిగిందని వేదపురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఉంటుంది. అనేకమంది భక్తులు ఇక్కడకు వచ్చి నరసింహస్వామికి మొక్కులను చెల్లించుకుంటారు.

5 / 5
ఇక్కడి నరసింహ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న పనులు వెంటనే అవుతాయని, ఈ దేవాలయం కు వచ్చి దర్శించుకుని వెళితే ఏ పనైనా ఎదురులేకుండా అవుతుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఇక్కడ శాంతింపబడి ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి ఈ దేవాలయమును దర్శించుకోవడం వల్ల చాలా మనశ్శాంతి కూడా ఉంటుందని భక్తుల నమ్మకం..