
అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా తెరకెక్కిన 'మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి' సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న మరో మేజర్ మూవీ ఓ మై గాడ్ 2. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనే సున్నిత కథాంశాన్ని అద్భుతంగా చూపించారీ మూవీలో. ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ వారం ఓటీటీలో విడుదలైన మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లను ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్ మంచి సిరీస్‌లను మూవీస్‌ను తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 4 నుంచి బెక్ హమ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఎవ్రీథింగ్ నౌ అనే వెబ్ సిరీస్ అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా అక్టోబర్ 6వ తేదీ నుంచి ముంబై డైరీస్ అనే బాలీవుడ్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జీ5 ఓటీటీలో అక్టోబర్ 6వ తేదీ నుంచి గదర్ 2 మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.