
సృష్టిలో ఉండే పూల మొక్కల్లో వేటికవే సాటి..! వాటిలో ఒకటి దీన్నే లిల్లీ ఆఫ్ ది వ్యాలీ ట్రీ.. దానినే ఫెయిరీ పెట్టి కోట్ అని అంటారు. ఎలియో కార్పస్ గ్రాండి ఫ్లోరస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక అద్భుతమైన సతత హరిత వృక్షం. ఆకర్షణీయమైన జాలువారే గంట ఆకారపు పుష్పాలుగా ఇది విశేషంగా ఆకట్టుకుంటాయి. వేలాడుతూ కొమ్మలు లేని గుత్తులుగా పూసే ఈ పువ్వులే దీన్ని స్పెషల్ ఎట్రాక్షన్.

ఎరుపు గులాబీ రంగులో.. గిన్నె ఆకారంలో ఉండే రక్షక పత్రాల మధ్య.. శ్వేత వర్ణంలో విచ్చుకొనే ఈ పూలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రేమతో కూడిన వాతావరణంలో పెరిగే ఈ మొక్కలు.. ఆగ్నేయాసియాలో ఎక్కువగా పెరుగుతాయి. నీడ కలిగిన అటవీ ప్రాంతంలో కనిపిస్తాయి. అత్యంత అడుదుగా కనిపించే ఈ పుష్పాలు ఇప్పుడు విశాఖలో కనిపిస్తున్నాయి.

విశాఖలోని జీవవైవిద్య ఉద్యానవనంలో జాలువారే గంట మాదిరిగా ఉన్న ఆ పూలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. సతత హరిత అడవుల్లో, నదీ దిరాల్లో పెరిగే ఈ మొక్క.. ఇప్పుడు ఒక ఉద్యానవనంలో పెరిగి అందమైన పుష్పాలతో ఆకట్టుకుంటుంది. ప్రకృతి ప్రేమికులను తమ వైపు పిలుస్తోంది.

ఎలియో కార్పస్ గ్రాండీఫ్లోర్స్ కుటుంబానికి చెందిన ఈ మొక్కను లిల్లీ ఆఫ్ ద వ్యాలీ ట్రీ అని కూడా అంటారు. తెల్లటి అంచులతో చిరిగినట్టు ఉండే పూలు. వేలాడుతూ కొమ్మలు లేని గుర్తులుగా పూసే ఈ పువ్వులే దీని ప్రధాన ఆకర్షణ. ఈ పూల పరిమళం కూడా ఒక ప్రత్యేకత. నిగనిగ లాడుతూ తమ వైపు ఆకట్టుకోవడం ఈ పూలు.. లేత తీయటి సోంపు మాదిరి వాసనను కూడా వెదజల్లుతాయి.

'చెట్టులో ప్రతి భాగం దేనికదే ప్రత్యేకం. హిమాలయ పర్వతశ్రేణిల్లో కొన్నిచోట్ల కనిపిస్తాయి. ఈ పుష్పాలు మే నుంచి వికసిస్తూ ఉంటాయి. హిమాలయ రుద్రాక్ష కు ఈ చెట్లు దగ్గరి బంధువు అని అంటారు. దీని ఆకులు కూడా ఒక ప్రత్యేకతే.. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పత్రాలు బల్లెం ఆకారంలో ఉంటాయి. మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. లేత ఆకులు ఎరుపు రంగులో కనిపిస్తాయి. ముదిరిన ఆకులు రాలిపోయే ముందు దాని రంగు ప్రకాశవంతంగా మారి ఆకర్షణ మరింత పెంచుతాయి. ఈ పుష్పాలు సీతాకోకచిలుకులను ఆకర్షిస్తాయి.' అని అంటున్నారు జీవవైవిద్య ఉద్యానవనం నిర్వాహకులు ప్రొఫెసర్ రామమూర్తి.