
బాదంపప్పులాగే వాటి తొక్కలు కూడా మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తాయి. ఈ పీల్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇది చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని పరిశోధన ప్రకారం బాదం తొక్కలలో పుష్కలంగా పాలీఫెనాల్స్ కలిగి ఉంటాయి. ఇది మీ కంటి చూపును, జ్ఞాపకశక్తిని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కి కూడా ఇది మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు.

బాదం తొక్కలలో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో పాలీఫెనాల్స్ సహాయపడతాయి. ఇది గుండెల్లో వచ్చే దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు పాలీఫెనాల్స్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి.

శరీరంలో రక్తం గడ్డకట్టడం అనేది తీవ్రమైన అనారోగ్య సమస్య. దీని వల్ల రక్తప్రసరణ ఆగిపోయి గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కానీ పాలీఫెనాల్స్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇటీవలి అధ్యనాల ప్రకారం.. పాలీఫెనాల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచించాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.

బాదం తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి పేగులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. బాదం తొక్కలు, గుమ్మడికాయ గింజలతో పొడిని తయారు చేసుకుని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే..మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

బాదం తొక్కలతో హెయిర్ మాస్క్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం, 1/2 కప్పు బాదం తొక్క, 1 గుడ్డు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, తేనె కలిసి ప్యాక్‌కి కావాల్సిన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు అంతటికి బాగా పట్టించి సుమారు బాగా ఆరనివ్వాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో వాష్ చేసుకోవాలి. దీంతో మీకు ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకున్నంత షైన్ వస్తుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ ఇ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంది.