
నిమ్మకాయ నీరు అనేక పోషకాలతో నిండిఉంటుంది. అయితే దీన్ని అధికంగా తీసుకుంటే ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ పళ్ల ఎనామిల్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందువల్ల, నిమ్మకాయ నీరు తాగిన వెంటనే నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.

అనేక అవయవాలు దెబ్బతింటాయి: నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాల స్థాయి మన శరీరంలో పెరిగితే, అది చాలా ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది.. అందుకే చాలా మంది వైద్యులు దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఎక్కువగా నిమ్మరసం తీసుకుంటే.. ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోండి..

Lemon Water

నోటిలో పుండ్లు: నిమ్మకాయను తరచుగా నోరు, దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.. అయితే మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నిమ్మరసం తాగితే, అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి కణజాలంలో వాపును కలిగిస్తుంది.. దీని కారణంగా నోటిలో పొక్కులు, అల్సర్ పండ్లు, మంట ఏర్పడుతుంది.

బలహీనమైన దంతాలు: మీరు నిమ్మరసం తాగినప్పుడల్లా స్ట్రా పైపును ఉపయోగించటానికి ప్రయత్నించండి.. ఎందుకంటే ఇది దంతాలతో నిమ్మరసం సంబంధాన్ని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల దంతాలు బలహీనపడవు. నేరుగా నిమ్మరసం తాగడం వల్ల దంతాలు చెడిపోయే ప్రమాదం ఉంది.