Healthy Drinks: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ తాగితే ఆ సమస్యలన్నీ పరార్‌!

|

May 29, 2024 | 8:42 PM

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా? గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయని అందరూ అనుకుంటారు. అయితే ఇందులో కాసిన్ని చియా గింజలను కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు..

1 / 5
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా? గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయని అందరూ అనుకుంటారు. అయితే ఇందులో కాసిన్ని చియా గింజలను కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

2 / 5
బరువు తగ్గడానికి చియా విత్తనాలు చేసే మేలు అంతాఇంతా కాదు. పోషకాహార నిపుణులు కూడా ఈ గింజలను నీటిలో నానబెట్టుకుని తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ చియా సీడ్స్ తిన్న తర్వాత శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయట. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అతిగా తీసుకుంటే అనర్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
చియా గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా, కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అయితే చియా విత్తనాలు అందరికీ మంచిది కాదు.

4 / 5
చియా విత్తనాలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అని పిలువబడే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాదు ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయట. కాబట్టి చియా సీడ్స్ ఎక్కువగా తినకండి. చియా గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు రక్తాన్ని పల్చగా మార్చడంలో సహాయపడతాయి. దీంతో శరీరంలో ఏ భాగంలోనైనా గాయం అయితే రక్తస్రావం ఆగదు. అందుకే చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా ఈ చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. ఇవి ఎప్పుడైనా బీపీ తగ్గించగలవు.

5 / 5
నిమ్మ - చియా నీటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి అలసటగా ఉన్నప్పుడు ఈ వాటర్ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నిమ్మరసం - చియా వాటర్‌ అలసట నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి. వేసవిలో ఈ వాటర్ తాగడం వల్ల శరీరానికి తాజాదనం వస్తుంది. చియా గింజలను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఒక నిమ్మ కాయ అందులో పిండి ఖాళీ కడుపుతో తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.