
రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలతో బంగారు ఆభరణాలు మధ్యతరగతి వాళ్లకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. పెరగడమే తప్పా, తగ్గడం తెలీదు అనే రీతిలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. ఇవాళ ఒక్క రోజే.. అది కూడా ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

గత కొన్ని రోజులుగా బంగారం బ్రేకులేని బండిలా దూసుకుపోతుంది. రోజుకు ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. ఇవాళ కేవలం నాలుగు గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,830గా ఉండగా అది 11 గంటల వరకు 650 పెరిగి ప్రస్తుతం రూ.1, 39,480గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం తులం బంగారం ధర రూ. 1,27,850గా కొనసాగుతుంది.

ఇక మన తెలుగు రాష్ట్రాలైన హైదారబాద్, విజయవాడలో బంగారం ధరలు చూసుకుంటే.. -హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1, 39,480గా ఉండగా .. ఉదయం ఈ ధర రూ.1,38,830గా ఉంది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,850గా ఉండగా ఉదయం రూ1,27,260గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ముంబై, కెరళ, బెంగళూరు కోల్‌కతాలోనూ హైదరాబాద్ తరహా ధరలే కొనసాగుతుండగా చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,40,400కు చేరింది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 1,39,630 వద్ద కొనసాగుతోంది.

అటు వెండి కూడా తగ్గేదేలే అంటుంది. బంగారం కన్నీ హై స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈ ఒక్క రోజు.. అది కూడా కేవలం మూడు గంటల్లోనే కేజీ వెండి రూ.10,000 వేల వరకు పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటలకు కేజీ వెండి ధర రూ.2,53,100 వద్ద కొనసాగుండగా ఉదయం 11 గంటలకు ఇది 2,63,000 వేలకు చేరింది.