
గత వారంలో రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు రెండ్రోజులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని ఆనందించేలోపే కొనుగోళు దారులకు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి బంగారం ధర రూ.700 పెరిగింది.

దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన తులం బంగారం ధర రూ.1,38,710గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.660 పెరిగి ప్రస్తుతం రూ.1,27,150 వద్ద కొనసాగుతుంది

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు చూసుకుంటే, హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,710గా కొనసాగుతుండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,37,990గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,150గా ఉంది. అటు విజయవాడ, విశాఖ పట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన కోల్‌కతా, ముంబై, బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,710గా కొనసాగుతుండగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,860గా ఉంది. చెన్నైలో తులం బంగారం ధర రూ.1,39,640గా ఉంది.

అయితే కొనుగోలు దారులకు ఇటు బంగారం షాకిస్తుంటే.. అటు వెండి మాత్రం స్వల్ప ఊరటనిచ్చింది. శుక్రవారం ఉదయం నుంచి 10 గంటల మధ్యలో వెండి ధర భారీగా తగ్గింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు కేజీ వెండి ధర రూ.2,51,900గా ఉండగా రూ.3000 వేలు తగ్గి ప్రస్తుతం రూ.2,49,000 వద్ద స్థిరపడింది.