
హైస్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలకు సడెన్ బ్రేకులు పడ్డాయి. గత రెండు మూడు రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 24 క్యారెట్ల తులం బంగారం రూ.10 తగ్గగా, గురువారం ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య రూ.260 తగ్గింది.

భారీ తగ్గుదల తర్వాత దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,38,000 వద్ద కొనసాగుతుంది. ఈ ధర ఉదయం 6 గంటలకు 1,38,260గా ఉంది, ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,26,500గా కొనసాగుతుండగా.. ఈ ధర ఉదయం రూ.1,26,740గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర చూసుకుంటే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,38,000గా కొనసాగుతుండగా , 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,26,500గా ఉంది. అటు ఏపీలోని విజయవాడ, బెంగళూరు, కేరళ, పూనె, ముంబై నగరాల్లో సైతం ఇవే రేట్లు కొనాసగుతున్నాయి.

ఇక దేశరాజధాని ఢిల్లీలో మాత్రం 4 క్యారెట్ల తులం బంగారం ధర రూ 1,38,150 గా కొనసాగుతుండగా, అటు చెన్నైలో మాత్రం 4 క్యారెట్ల తులం బంగారం ధర రూ 1,39,090గా కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27, 500గా కొనసాగుతుంది

ఇక బంగారంతో పాటు సిల్వర్ కూడా భారీగా దిగొచ్చింది. కేవలం ఒక్కరోజు అది కూడా కేవలం 4 గంటల్లో సిల్వర్ ధర కేజీపై సుమారు రూ.5000 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,52,000గా ఉండగా, హైదరాబాద్, విజయవాడలో మాత్రం 2,72,000గా కొనసాగుతుంది.