
ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచేసింది.

చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతూనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి, స్టార్ హీరోయిన్ రేంజ్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌నే ఏలేస్తుందని అందరూ అనుకున్నారు.

అనుకున్నట్లుగానే వరసగా అవకాశాలు అందిపుచ్చుకొని, వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. కానీ ఈ బ్యూటీకి అదృష్టం అంతగా కలిసి రాలేదు, చేసిన సినిమాలన్నీ చాలా వరకు డిజాస్టర్ అవ్వడంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో కోలీవుడ్, మాలీవుడ్ చక్కేసి, అక్కడ వరసగా సినిమాలు చేస్తూ తన లక్కు పరీక్షించుకుంటుంది. అయితే ఈ బ్యూటీ అక్కడ కూడా వరసగా ఆఫర్స్ అందుకుంటున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు సంపాదించుకోవడం లేదని టాక్.

ఇక ఏదీ ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది. తన గ్లామర్‌తో కుర్రకారును మాయ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ చీరలో గ్లామర్ తో చంపేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.