
వేసవిలో కుటుంబంతో కాస్త సమయం గడపాలని అనుకుంటారు. ఎందుకంటే.. వేసవిలో పిల్లలకు స్కూల్స్.. కాలేజీల నుంచి సెలవులు రావడంతో సరదాగా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. మరీ అలా కుటుంబంతో కలిసి వెళ్లడానికి అనువైన ప్రదేశాలు ఎంటో తెలుసుకుందామా.

ఆగ్రా.. భారతదేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ద పర్యాటక కేంద్రాలలో ఆగ్రా ఒకటి. తాజ్ మాహల్ కాకుండా.. ఆగ్రా కోట వంటి అనేక చారిత్రక కట్టడాలు అనేకం ఉన్నాయి. మీ కుటుంబంతో వెళ్లడానికి సరైన ప్రదేశం.

డార్జిలింగ్.. మీరు మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి డార్జిలింగ్ అనువైన ప్రదేశం. ఇక్కడ అందమైన మైదానాలు ఉంటాయి.

శ్రీనగర్.. కుటుంబంతో కలిసి వెళ్లడానికి శ్రీనగర్ బెస్ట్.. ఇక్కడ అందమైన సరస్సులు ఉన్నాయి. కానీసం 7 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుని వెళ్లాలి. ఎందుకంటే.. అప్పుడే మీరు పూర్తిగా శ్రీనగర్ ఎంజాయ్ చేయాలి.

నైనిటాల్.. ఇక్కడ ఎన్నో అద్భుతమైన.. సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. పర్వతాల మధ్య కుటుంబంతో కలిసి ఎజాయ్ చేయవచ్చు. ఇక్కడ పిల్లల కోసం అనేక వినోద కార్యక్రమాలు ఉంటాయి.

అండమాన్.. అండమాన్ నికోబార్ దీవులకు ఇప్పుడు పర్యాటకుల తాకిడి ఎక్కువైది. సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.