Rajitha Chanti |
May 19, 2022 | 9:14 PM
Skin Care: ఆయిల్ స్కీన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ చిట్కాలను పాటిస్తే సరి..
జిడ్డు చర్మం ఉన్నవారికి దోసకాయ మంచిది. ఓపెన్ పోర్స్ సమస్య జిడ్డు చర్మంపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రంధ్రాల నుంచి చర్మంలోని నూనె విడుదలవుతుంది. ఈ సమస్య ఉన్నవారు దోసకాయ ఫేస్ ప్యాక్ లేదా ఐస్ క్యూబ్ ఉపయోగించడం వలన చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.. జిడ్డు చర్మం సమస్య కూడా తగ్గుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారిలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. అలాంటి సమయంలో వారు చర్మంపై వేప పొడి లేదా వేప నూనె ఉపయోగించాలి.. ఇది మొటిమల సమస్యను తగ్గిస్తుంది. అలాగే జిడ్డు చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుండా కాపాడుతుంది.
అలాగే చందనం పొడి కూడా ఉపయోపడుతుంది. గంధం జిడ్డు చర్మాన్ని అదనపు నూనె విడుదలను నియంత్రిస్తుంది. ఇది చర్మంపై ఉన్న అన్ని మచ్చలను కూడా తొలగిస్తుంది. ఇది సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
నిమ్మరసం స్కిన్ టోన్ ను ప్రకాశవంతం చేయడమే కాకుండా.. ఇందులోని సిట్రిక్ యాసిడ్ ఆస్ట్రింజెంట్ గా కూడా పనిచేస్తుంది. ఇది జిడ్డు చర్మంలో అదనపు నూనెను నియంత్రిస్తుంది.
శనగపిండి.. చర్మానికి మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా.. చర్మంపై తెరుచుకున్న రంధ్రాల సమస్యను తగ్గిస్తుంది. అలాగే మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
జిడ్డుగల చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం. అలాంటప్పుడు అలోవెరా జెల్ సహాయం చేస్తుంది. ఇది వేసవిలో చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా చర్మానికి తేమను అందిస్తుంది.