పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎవరైనా సరే వారంలో 100-200 గ్రాముల చీజ్ తినవచ్చు. ఇంతకు మించి తింటే శరీరానికి రకరకాల సమస్యలు వస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే శాఖాహారులు తినే ఆహారంలో పన్నీర్ తో తయారు చేసిన ఆహారపదార్ధాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
పన్నీర్ తో కూర చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాదు ఈ కూరలో వేసే మసాలా పర్ధాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎక్కువగా పన్నీర్ లో జీలకర్ర, అల్లం వెల్లుల్లి వంటి మసాలా దినుసులు వేసి తయారు చేస్తారు. కొంతమంది పరాఠా, దోస వంటి వాటిని కూడా ఈ పన్నీర్ తో ఫిల్లింగ్ చేస్తారు. మలై పనీర్, కర్డ్ పనీర్, పనీర్ రోల్స్ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు.
అయితే నచ్చింది అంటూ ఆహారాన్ని ఎక్కువగా తినడం హాని కలిగిస్తుంది. అలాగే పన్నీరు కూడా. శరీరానికి మంచిదే అయినా మితంగా తినాలి. ఇష్టం కదా అంటూ అత్యాశకు వెళ్లి ఎక్కువ తింటే సమస్యలు తప్పవు. చీజ్ పోషక పదార్ధం . ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి చీజ్ ముఖ్యం. అయితే ప్రతిరోజూ జున్ను తినడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
జున్ను ఎక్కువగా తినడం వల్ల లాక్టోస్ లో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే పాలు, పాల పదార్ధాలతో తయారు పదార్ధాలను తినడం వలన సమస్యలున్నవారు సైతం పన్నీరుని తినవచ్చు.
పన్నీర్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్‌తో పాటు ఎసిడిటీ సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. దాంతో పాటు బరువు పెరగడం, మధుమేహం సమస్యలు, కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతూనే ఉంటాయి.
పన్నీరు ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి సమస్యతో ఇబ్బంద ప్దుపడతారు. అంతేకాదు దరదతో పాటు అలర్జీ సమస్యలు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి పన్నీరు ను మితం,మితంగా తినండి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండండి..