
ఫ్రాన్స్ అంటే గుర్తుకొచ్చేది. ఒకటి ప్యారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్, రెండు పెర్‌ఫ్యూమ్‌లు. కానీ ఆ దేశంలో ఎన్నో ఆసక్తికర విషయాలు దాగున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రైస్తవులు పెళ్లి చేసుకునేటప్పుడు వధువు తెల్లని దుస్తులు వేసుకొనే సంప్రదాయం ప్రాన్స్‌లోనే పుట్టింది. 1499వ సంవత్సరంలో తొలిసారిగా కింగ్ 12వ లూయిస్ భార్య.. వాళ్ల వివాహానికి తెల్లటి దుస్తులు ధరించింది.

ఫ్రాన్స్ ప్రజలు ప్రతిఏడాది 30 వేల మెట్రిక్ టన్నుల నత్తలను తింటారు. ఏప్రిల్ ఫూల్ డే రోజున అక్కడ మనుషుల వీపుపై కాగితంతో తయారు చేసిన చేప బొమ్మలు అతికిస్తారు. అనంతరం ఏప్రిల్ ఫిష్ అని పిలుచుకుంటారు. అయితే అది అక్కడి ఆచారంగా భావిస్తారు.

అక్కడ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాక ఒకవేళ అతను లేదా ఆమె మరణిస్తే వాళ్ల మృతదేహాన్ని కూడా వివాహం చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఓ కండిషన్ కూడా ఉంది. చనిపోయిన వారిని చేసుకోవాలంటే వాళ్లు తమని ప్రేమించారని నిరూపించాల్సి ఉంటుంది.

ఫ్రాన్స్‌లో ఆహారాన్ని బయట పారేయడం నిషేధం. ఎవరైనా పట్టుబటితే వాళ్లని కఠినంగా శిక్షిస్తారు. ఒకవేళ ఆహరం మిగిలిపోతే దాన్ని ఛారిటీలకు లేదా ఫుడ్ బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది.

మొబైల్ కెమెరాను తయారుచేసింది కూడా ఫ్రాన్స్‌కు చెందిన ఫిలిప్ ఖాన్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్డ్ మ్యూజియం ప్యారిస్‌లో ఉంది. అలాగే ఇక్కడి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ముద్దులు పెట్టుకోవడం కూడా నిషేధం. ఇలా చేయడం రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యేవని అందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చారు.