
కివీ పండును ఎక్కువగా తినడం వల్ల నోరు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. కివీ పండులో ఉండే ఎంజైములు కొందరిలో నోరు, పెదవులు లేదా గొంతులో చికాకు లేదా మంట కలిగించవచ్చు. కివీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అధికంగా తింటే పొట్టలో గ్యాస్, ఉబ్బరం లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే వారానికి ఒకటి లేదా రెండు కివీ పండ్లకు మించి తినకూడదు. ముఖ్యంగా, పరగడుపున కివీ పండును అస్సలు తినకూడదు.

Kiwi Fruit

అలాగే, రక్తాన్ని పలుచబడే మందులు తీసుకునే వారు కూడా కివీ పండు తినే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. కివీలో రక్తం గడ్డకట్టకుండా చేసే గుణం ఉంటుంది, కాబట్టి మందులతో కలిపి తింటే సమస్యలు తీవ్రమవుతాయి.

కివీ తొక్కపై ఉండే చిన్న వెంట్రుకల లాంటి సూక్ష్మమైన నారలు కూడా కొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. కివీ పండుతో అలర్జీ ఉన్నవారు తొక్కను తాకినా, తిన్నా చర్మంపై చికాకు లేదా ఎరుపు రంగు దద్దుర్లు కనిపించవచ్చు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి. కివీ ఎంత ఆరోగ్యకరమైనదైనా, దానిని మితంగా తీసుకోవడం మాత్రమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. కివీ పండు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.