AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: ఈ తప్పులే చేయొద్దనేది.. వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో రిప్రిజియేటర్లు ఉంటున్నాయి. మార్కెట్‌ నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లు వంటివి పాడవకుండా ఉండేందుకు చాలా మంది ప్రిజ్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే అన్ని కూరగాయలు, పదార్థాలకు ఫ్రిజ్‌లో ఉంచడం కరెక్టేనా అంటే అస్సలు కాదు. అవును కొన్ని వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి సహజ గుణాలు, రుచి కోల్సోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రిజ్‌లో ఏ కూరగాయాలు ఉంచకూడదో చూద్దాం.

Anand T
|

Updated on: Jul 08, 2026 | 8:06 AM

Share
టమోటాలు: చాలా మంది టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. కానీ ఇది మంచిదికాదు. వాటిని ప్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని సహజ ఎంజైమ్‌ల ప్రక్రియ నశిస్తుంది. ప్రిజ్‌లో ఉండే ఎక్కవ చల్లదనం టమోటా కణాలను నాశనం చేసి, వాటి అసలు రుచిని తగ్గిస్తుంది. అంతేకాదు తొక్క ముడతలు పడేలా చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ టామాటాలను సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మంచిది.

1 / 5
ఆలుగడ్డలు: ఆలూను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పిండి పదార్థం చాలా వేగంగా చక్కెరగా మారుతుంది. ఇది ఆలూకు ఉండే సహజ రుచిని మార్చేస్తుంది. అలాగే వీటిని వండినప్పుడు త్వరగా మాడిపోయేలా చేస్తుంది. కాబట్టి బంగాళదుంపలను ఎప్పుడూ ప్రిజ్‌లో ఉంచకూడదు. వీటిని గాలి ఆడేలా ఉండే ఒక పేపర్ బ్యాగ్‌లో లేదా బుట్టలో వేసి చీకటిగా ఉండే ప్రదేశంలో ఉంచాలి.

2 / 5
ఉల్లిపాయలు: చాలా మంది చేసే తప్పు ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టడం. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ లోపల ఉండే ఎక్కువ తేమ ఉల్లిపాయలు త్వరగా మెత్తబడి, బూజు పట్టేలా చేస్తుంది. కాబట్టి ఉల్లిపాయలను ఎల్లప్పుడూ పొడిగా, గాలి ఆడే ప్రదేశాలలో లేదా గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచాలిజ. అలాగే, బంగాళాదుంపలను, ఉల్లిపాయలను కలిపి ఒకేచోట అస్సలు ఉంచకూడదు.

3 / 5
అరటిపండ్లు: చాలా మంది అరటి పండ్లను కూడా ఫ్రిజ్‌లోని ఉంచుతారు. కానీ ఇలా చేయడం ద్వారా ప్రిజ్‌లోని తక్కువ ఉష్ణోగ్రతలో వాటి సహజ జీవక్రియలకు ఆటంకం కలుగిస్తుంది. దీనివల్ల తొక్కపై ఆక్సిడేటివ్ రియాక్షన్స్ జరుగుతుంది. చల్లదనం వల్ల పండ్ల కణాలు దెబ్బతిని, తొక్క త్వరగా నల్లగా మారిపోతుంది.

4 / 5
తేనె: చాలా మంది తేనెను కూడా ఫ్రిజ్‌లో దాచుకుంటారు. కానీ, తేనె సహజంగానే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా సంవత్సరాల తరబడి పాడవకుండా ఉంటుంది. దీనిని ఫ్రిజ్‌లో పెడితే గడ్డకట్టడమే కాకుండా, వాడుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే తేనె ఎన్నాళ్లయినా పాడవకుండా ఉంటుంది.

5 / 5
Follow Us