తళతళ మెరిసే తమలపాకుల్లో దాగున్న ఔషధ గుణాలు తెలుసా?

04 October 2026

TV9 Telugu

TV9 Telugu

ఇంట్లో జరిగే పూజలు, శుభకార్యాలకు, ముత్తైదువులకు వాయనమివ్వడానికి.. పూలు పండ్లతో పాటు ఎక్కువగా ఉపయోగించేది తమలపాకులే

TV9 Telugu

ఇలా శుభప్రదంగా వాడే తమలపాకులు కొన్ని రకాల అనారోగ్యాల్నీ దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకు వీటిలోని ఔషధ గుణాలే కారణమట

TV9 Telugu

వీటిని తింటే శరీరంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలుంటే తొలగిపోతాయట. పెద్ద కప్పు నీటిలో కొన్ని తమలపాకులు వేసి నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించాలి

TV9 Telugu

ఈ నీటిని తాగడం వల్ల కూడా పలు ప్రయోజనాలు పొందచ్చట. అలాగని ఆరోగ్యానికి మంచిదని అతిగా తీసుకోవడం కూడా మంచిది కాదట

TV9 Telugu

ఇవి నోటి దుర్వాసనను దూరం చేస్తాయట. అలాగే చిగుళ్ల నుంచి వచ్చే రక్తస్రావాన్ని ఆపి.. దంతాలను దృఢపరిచే గుణం తమలపాకులకు ఉందంటున్నారు నిపుణులు

TV9 Telugu

చర్మంపై దురద, అలర్జీ.. మొదలైన సమస్యలను కూడా తమలపాకులు దూరం చేస్తాయట. వీటిలో ఉండే యాంటీసెప్టిక్‌ గుణాలే ఇందుకు కారణమట

TV9 Telugu

గాయాలు మానడానికి తమలపాకుల్ని ఉపయోగిస్తారు. ఈ క్రమంలో కొన్ని తమలపాకుల నుంచి తీసిన రసాన్ని గాయంపై రాసి.. దానిపై మరో తమలపాకును ఉంచి కట్టు కట్టాలి

TV9 Telugu

ఫలితంగా గాయం మానే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే ఈ చిట్కాలను పాటించే ముందు ప్యాచ్‌ టెస్ట్ చేసుకోవడం మంచిది