
క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మూత్రపిండాల్లో రాళ్లు వంటి ఇతర సమస్యలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. ముఖ్యంగా మన రోజు వారీ అలవాట్లు కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఆ అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ధూమపానం వల్ల ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. ఇది మూత్రపిండ కణ క్యాన్సర్ (RCC) ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు కూడా RCC అవకాశాలను పెంచుతాయి. అధిక రక్తపోటు కారణంగా మూత్రపిండాల కణాలు దెబ్బతీస్తున్నట్లు వివిధ అధ్యయనాలు రుజువు చేశాయి.

ఊబకాయం కూడా కిడ్నీ వ్యాధి. RCCకి దానితో ప్రత్యక్ష సంబంధం ఉంది. కాబట్టి అధిక శరీర బరువు ఆరోగ్యానిక చేటు. కాడ్మియం, ఆస్బెస్టాస్, పెట్రోలియం ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటిని ఉపయోగించే వారిలో కిడ్నీ పాడయ్యే అవకాశాలు పెరుగుతాయి.

చాలామంది డాక్టర్ సలహా పాటించకుండా మెడికల్ షాపుల నుంచి ఇష్టం వచ్చిన మందులు తెచ్చుకుని వాడుతుంటారు. వీటిల్లో ఉండే అనాల్జెసిక్స్ అధికంగా ఉపయోగించడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది.

దీర్ఘకాలిక హెపటైటిస్ సి RCCకి కారణం అవుతుంది. ఇది పలు రకాల కిడ్నీ సమస్యలను పెంచుతుంది. కాబట్టి తెలిసో తెలియకో ఇప్పటి వరకూ ఇలాంటి అలవాట్లు ఉన్న వారు వెంటనే మానుకుంటే మంచిది.