అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం అంతసులభమేమీకాదు. అయితే పొలార్డ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. గతేడాది మార్చి 4న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతను ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు భారత్‌కు చెందిన యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్ మాత్రమే ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదారు.