- Telugu News Photo Gallery Cricket photos MS Dhoni to Rohit Sharma lead the highest earners from IPL career full list check here
Highest Earners in IPL: ధోని నుంచి రోహిత్ వరకు.. IPL చరిత్రలో అత్యధికంగా సంపాదించింది వీళ్లే..
ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న వారిలో ముందున్నారు. పూర్తి జాబితాను ఇప్పుడు చూద్దాం.
Updated on: Apr 20, 2022 | 7:44 PM

మాజీ భారత, చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి భారీ మొత్తాన్ని సంపాదించాడు. ధోనీ మొదటి నుంచి ఈ లీగ్ ఆడుతున్నాడు. CSK కోసం ఎల్లప్పుడూ మార్క్యూ ప్లేయర్. చెన్నై టీం నిషేధానికి గురైన రెండేళ్లలో.. ధోనీ రైజింగ్ పూణే సూపర్‌జెయింట్‌కి మారాడు. అయితే, ఈ మార్పు ధోనీ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. 2008 నుంచి ఐపీఎల్‌లో రూ.164 కోట్లు సంపాదించాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌ను డెక్కన్ ఛార్జర్స్‌లో రూ. 9 కోట్లతో ప్రారంభించాడు. ఆ తర్వాత రూ.9.2 కోట్లతో ముంబై ఇండియన్స్‌కు వెళ్లాడు. ప్రస్తుతం అతను తన సేవల కోసం ముంబై నుంచి రూ.16 కోట్లు అందుకుంటున్నాడు. మొత్తంగా రోహిత్ 2008 నుంచి దాదాపు రూ. 162.6 కోట్లు సంపాదించాడు.

కోహ్లి 2008లో RCBలో చేరాడు. U19 వరల్డ్‌లో అతని పరాక్రమాల తర్వాత అదే సంవత్సరం అతని నాయకత్వంలో భారతదేశం విజేతగా నిలిచింది. రూ.12 లక్షలతో బెంగళూర్ జట్టులో చేరాడు. 2019 తర్వాత కోహ్లీ రూ. 8.2 కోట్లు అందుకున్నాడు. ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కోహ్లీ రూ. 15 కోట్లు తీసుకున్నాడు. కోహ్లీ మొత్తం సంపాదన ఇప్పటివరకు రూ.158.2 కోట్లుగా ఉంది.

కేఎల్ రాహుల్ తన IPL కెరీర్‌ను 2013లో ప్రారంభించాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయినప్పటి నుంచి రాహుల్ సంపాదన అమాంతం పెరిగింది. ప్రస్తుతం కొత్త IPL ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. 2013లో RCB తరపున రూ. 10 లక్షలు అందుకున్న కేఎల్.. 2022లో LSGలో రూ. 17 కోట్లకు చేరుకున్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా రూ.65.1 కోట్లు సంపాదించాడు.

భారత క్రికెట్ జట్టులో మరో సూపర్ స్టార్ హార్దిక్ పాండ్యా.. ఈ ఏడాది మాత్రమే కొత్త ఐపీఎల్ జట్టుకు మారాడు. అతను తన కెరీర్‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్ తరపున మొదటి మూడు సీజన్‌లకు గాను ప్రతి ఏటా రూ. 10 లక్షలు అందుకున్నాడు. ఆ తర్వాతి నాలుగు సీజన్‌లలో ఒక్కో సీజన్‌కు రూ. 11 కోట్ల చొప్పున సంపాదించాడు. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం రూ. 15 కోట్లకు దక్కించుకుంది. మొత్తంగా దాదాపు రూ.59.3 కోట్లు సంపాదించాడు.




