Lord Srirama: రామయ్యపై భక్తిని చాటుకున్న ఆర్ఎస్ఎస్ నేత.. కుమార్తె పెళ్లి పత్రికతో పాటు రామయ్య విగ్రహం పంపిణీ ఎక్కడంటే..

|

Feb 16, 2024 | 2:33 PM

మాఘ మాసం అడుగు పెడుతూనే పెళ్లి సందడి తెచ్చేసింది. దీంతో వివాహ వేడెక్కి రెడీ అవుతున్న వధువరుల కుటుంబాలు షాపింగ్, కళ్యాణ మండపం అంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసి.. పెళ్ళికి రమ్మనమని ఆహ్వానాన్ని పంపుతున్నారు. అయితే కొంతమంది ఇలా పెళ్ళికి ఆహ్వానించే  వివాహ ఆహ్వానపత్రికతో పాటు స్వీట్స్ లేదా చిన్న చిన్న గిఫ్ట్స్ వంటి వాటిని అందిస్తారు. తాజాగా ఓ  ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు తనకు రామయ్య మీద ఉన్న భక్తిని తెలియజేస్తూ వివాహ ఆహ్వానపత్రికతో పాటు పంచలోహ విగ్రహాన్ని పంచి పెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. 

1 / 6
కర్ణాటక బాగల్‌కోట్‌ జిల్లా రబకవి బనహట్టికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తన కుమార్తె వివాహ ఆహ్వానపత్రికతో పాటు ఆంజనేయ, లక్ష్మణ సమేత పంచలోహ విగ్రహాన్ని పంపిణీ చేశారు.  

2 / 6
తన కుమార్తె పెళ్ళికి రమ్మనమని ఆహ్వానాన్ని అందిస్తూనే అదే సమయంలో బహుమతిగా సీతారాముల విగ్రహాన్ని అందజేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. 

3 / 6
తమ ఇంట జరుగుతున్న కుమార్తె పెళ్ళికి రెండు వేల మందిని పైగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు పిలిచారు. ప్రతి పెళ్లి పత్రికతో పాటు ఈ విగ్రహాలను పంపిణీ చేశారు.

4 / 6

పెళ్లి ఆహ్వాన పత్రికకు జతగా పంచలోహానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుల విగ్రహం ఇచ్చి అతిధులను ఆహ్వానించడంతో అతనికి సీతారాముల మీద ఉన్న భక్తిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. 

5 / 6

రాబకవిబనహట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు సోమనాథ్‌ గొంబి కుమార్తె లక్ష్మి వివాహం ఫిబ్రవరి 19న జరగనుంది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న రబకవికి చెందిన కిరణ్ అనే యువకుడితో లక్ష్మి వివాహం జరగనుంది.

6 / 6
250 గ్రాముల ఈ పంచలోహ విగ్రహం ఖరీదు 1500 రూపాయలు. దేశంలోని వివిధ ప్రముఖులకు, ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రాలను అందించినట్లు తెలుస్తోంది. 