వర్షాకాలంలో తప్పక చూడాల్సిన టూరిస్ట్‌ స్పాట్.. ఒక్కసారి ఇక్కడ చేపలు తింటే రుచి జన్మలో మర్చిపోరు!

Edited By:

Updated on: Aug 03, 2026 | 3:48 PM

Jurala Dam Tourism: వర్షకాలం మొదలైతే చాలు జూరాల జలాశయం కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఒకవైపు ఉప్పొంగుతూ పరవళ్లు తొక్కతున్న కృష్ణమ్మ.. మరోవైపు పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని పంచుతున్న జలాశయ పరిసరాలు సందర్శకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. పాల నురగళ్ల పారుతున్న నది అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీజన్ లో తొలిసారి జూరాల గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

1 / 5
పాలమూరు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల జలాశయం కేవలం సాగు,త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు.. ప్రకృతి అందాలకు నెలవు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణనది ప్రవేశించే తొలి ప్రాజెక్టు జూరాల. ఈ ప్రాజెక్టు గుండానే దిగువన ఉన్న శ్రీశైలం, నాగర్జున సాగర్ అటు దిగువకు ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచే వచ్చే ప్రవాహాలతో ప్రతి ఏడు జూరాల వద్ద కృష్ణానది ఎన్నో అందాలను సంతరించుకుంటుంది. దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఇదో మంచి డెస్టినేషన్ గా మారుతుంది.

2 / 5
జూరాలకు వచ్చే సందర్శకులు కేవలం ప్రకృతి అందాలే కాదు.. స్థానికంగా లభించే తాజా చేపల వంటలు సైతం విశేషంగా ఆకర్షిస్తుంటాయి. వరద ప్రవాహంలో తాజాగా పట్టిన చేపలతో అనేక రకాల రుచికరమైన వంటలు ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. జలాశయం ఒడ్డునే కూర్చూని.. జలసవ్వడుల ధ్వనులు వింటూ వేడివేడి వంటకాలు ఆస్వాదించడం ఓ మధురానుభూతి.

3 / 5
వీకెండ్‌లు, సెలవు రోజుల్లో జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల తాకిడి మామూలగా ఉండదు. హైదరాబాద్ తో పాటు చుట్టు ప్రక్కల ఉన్న జిల్లాల ప్రజలు, కర్ణాటక నుంచి పర్యాటకులు తరలివస్తారు. జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిస్తే చాలు పర్యాటకుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతుంటుంది. గేట్ల గుండా పరవళ్లు తొక్కుతున్న కృష్ణ నదీ ప్రవాహాన్ని చుట్టు ప్రక్కల ఆహ్లాదకరమైన ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటారు. రీల్స్, సెల్పీలతో యువత సందడి చేస్తుంటారు.

4 / 5
జూరాలకు వరద వస్తే రైతుల్లో ఎంత ఆనందం కలుగుతుందో.. అంతే స్థాయిలో స్థానిక మత్స్యకారులకు కూడా ఆనందం. నదీ ఒడ్డున చేపల వంటలు సిద్ధం చేసే ఇక్కడ గుడిసేలు జనాలతో కళకళలాడుతుంటాయి. తాజా తాజా చేపలతో చేసే ఫ్రైస్, చేపల పులుసు, ఇతర వంటకాలు ఎంతో రుచిని కలిగి ఉంటాయి. ఇక్కడ తయారు చేసే చేపల వంటకాల కోసమే సుదురు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు.

5 / 5
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలు.. పచ్చని ప్రకృతి.. నోరూరించే తాజా తాజా చేపల వంటకాలు జూరాలను రైనీ సీజన్ డెస్టినేషన్ గా మార్చేశాయి. కటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా సమయం గడపాలనుకునే వారికి ఇది అద్భుతమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. స్థానిక ఆహార రుచులను ఎంజాయ్ చేయాలంటే మీరు సైతం ఈ వీకెండ్ జూరాల డ్యాంను సందర్శించండి.

Loading...
Unable to load recommendations.
Follow Us