Jewellery Ideas: శ్రావణ మాసంలో సాంప్రదాయ దుస్తులతో ఈ ట్రెండీ జ్యువెలరీని ధరించండి.. మీరు స్టైలిష్‌గా కనిపిస్తారు

Updated on: Jul 08, 2023 | 10:42 AM

హిందువుల పండగలు పర్వదినాలు, శుభాకాంక్షలు వచ్చాయంటే చాలు ఇంట్లో సందడి నెలకొంటుంది. చాలా మంది మహిళలు పూజలు, పండుగలు, ఏదైనా ప్రత్యేక సందర్భంలో సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఈ సంప్రదాయ దుస్తులతో పాటు మరింత అందాన్ని పెంచేలా ట్రెండీ నగలను ధరించవచ్చు. ఆ నగలు మీ  రూపానికి అదనపు అందాన్ని సంతరించేలా చేస్తాయి. 

1 / 5
శ్రావణ మాసంలో మహిళలు ఎక్కువగా సంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో సాంప్రదాయ దుస్తులతో పాటు బంగారు, వెండి నగలను మాత్రమే కాదు.. నేటి జనరేషన్ కు అనుకూలంగా అనేక రకాల ట్రెండీ ఆభరణాలను ధరించవచ్చు. ఇది మీకు స్టైలిష్ లుక్ ను తీసుకుని రావడానికి ఉపయోగపడుతుంది.

2 / 5
ఆక్సిడైజ్డ్ ఆభరణాలు ఎప్పుడూ ట్రెండ్ ను సృష్టిస్తూనే ఉంటాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో భాగంగా  జుమ్కాలు, చెవిపోగులు, ఉంగరాలు ధరించవచ్చు. ఇది మీకు కూల్ లుక్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. 

3 / 5
మహిళలు కూడా శ్రావణ మాసంలో పచ్చని, ఎర్రని గాజులు ధరిస్తారు. ఈ సందర్భంగా ఆకుపచ్చ రంగు బ్యాంగిల్స్‌తో పాటు మల్టీకలర్ బ్యాంగిల్స్ కూడా ధరించవచ్చు. మీరు రంగురంగుల బ్యాంగిల్స్ కు కంకణాలు సైడ్ బ్యాంగిల్స్ గా ధరించవచ్చు.

4 / 5
ప్రస్తుతం చోకర్ నెక్లెస్ ప్రస్తుతం ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. సాంప్రదాయంగా చీరను ధరించినా లేదా  ట్రెండీ లుక్ కోసం డ్రెస్ ను ధరించినా దుస్తులకు అనుగుణంగా చోకర్ ధరించడం మంచి లుక్ వస్తుంది. దుస్తులకు తగినట్లు ముత్యాలు, రాళ్ల తో కూడిన నగలు లేదా ఏదైనా ఇతర డిజైన్‌తో ఉన్న ఆర్నమెంట్ బెస్ట్ ఎంపిక.   

5 / 5
సాంప్రదాయ దుస్తులతో పాటు ముక్కు పుడక ధరించండి. మీకు ప్రత్యేక రూపాన్ని ఇస్తుంది. బంగారం వస్తువులు, కుందన్ వర్క్ తో నగలు, ముత్యాలు లేదా స్టోన్ ముక్కు పుడక మీ రూపాన్ని లక్ష్మీదేవిని తలపిస్తుంది. 