
కావాల్సిన పదార్థాలు : సగ్గు బియ్యం, పెసరపప్పు, పాలు ఒక కప్పు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు.

తయారీ విధానంలోకి వెళితే..ముందుగా పెసరప్పు, సగ్గు బియ్యం రెండింటినీ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి, పాయసం తయారు చేయడానికి 30 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్ లోకితీసుకోవాలి. ఇవి ఉడకడానికి సరి పడ నీళ్లు పోసి, స్టవ్ ఆన్ చేసి, లోఫ్లేమ్ మంటపై ఉడకబెట్టుకోవాలి.

సగ్గు బియ్యం మెత్తగాఉడికి,పెసరపప్పు కూడాబాగా ఉడికిన తర్వాత ఈమిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలిపిపక్కనపెట్టుకున్న తర్వాత ఈమిశ్రమాన్నిపక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు జీడిప్పు వేయించుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో నెయ్యి వేసి, జీడిపప్పులు, కిస్మిస్ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

తర్వాత ఇందులోనే పాలు పోసి బాగా మరగబెట్టాలి. పాలు మరిగిన తర్వాత అందులో సగ్గు బియ్యం, పెసరప్పు మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పంచదారకు బదులుగా బెల్లం తురుము వేసి దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పాయసం రెడీ.

ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నోటికి రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు పండుగల సమయలో దీనిని ఎక్కువగా తీసుకుంటారంట.