చేప నిల్వ పచ్చడి ఇలా పెడితే వానాకాలం మొత్తం తినొచ్చు  

Prasanna Yadla

 26 June  2026

Pic credit - Pinterest

ముందుగా మీరు అర కిలో చేపను తీసుకుని బాగా కడిగి పసుపు, ఉప్పుతో కూడా బాగా కడిగి పక్కన పెట్టాలి 

అర కిలో చేప

ఈ చేప ముక్కలను బాగా ఆరబెట్టి  ఆయిల్ వేసి రంగు మారే వరకు ఎర్రగా వేయించాలి

 ఎర్రగా వేయించాలి 

ఇంకో వైపు ఒక పాన్‌లో కొద్దిగా నువ్వుల నూనె వేసి అది బాగా వేడయ్యాక ఆవాలు, మెంతులు కూడా వేసి బాగా వేయించండి.

నువ్వుల నూనె

ఇంకా వీటిలో కొద్దిగా కారం పొడి, చిటికెడు  పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మీడియం మంటపై కలుపుతూ వేపండి

 కారం పొడి, చిటికెడు  పసుపు

ఇంకా చింతపండు గుజ్జు కూడా వేసి నూనె పైకి తేలే వరకు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఈ చేప ముక్కలను వాటిలో  వేసి  కలపండి.

 చింతపండు గుజ్జు

ఇంకా చివర్లో అర టేబుల్ స్పూన్  మెంతుల పొడి గరం మసాలా కూడా చల్లితే ఎంతో రుచిగా ఉంటుంది .

మెంతుల పొడి గరం మసాలా

ఇంకా ఈ పచ్చడి చల్లారిన తర్వాత పొడిగా గాజు సీసాలో మాత్రమే దీనిని పెట్టుకోవాలి

 గాజు సీసాలో మాత్రమే

ఇంకా ఈ పచ్చడి పైభాగంలో ఎక్కువగా ఆయిల్ పోసి ఒక రోజు మొత్తం అలాగే ఉంచండి 

ఒక రోజు తరవాత తింటే సూపర్