బంగారం, వెండిని మించి.. ఇప్పుడు దీనికే ఫుల్‌ డిమాండ్.. ఏదంటే?

Updated on: Jan 30, 2026 | 3:36 PM

రోజురోజుకూ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అవి సమాన్యులకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ఈ క్రమంలో జనాలు ఇతర లోహాలపై పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మార్కెట్‌లో ఏ లోహాలకు ఎక్కవ డిమాండ్ ఉండబోతుంది. దేనికి ఎక్కువ డిమాండ్‌ ఉంటుందో చూద్దాం.

1 / 6
ప్రస్తుతం రోజుల్లో బంగారం, వెండికి ప్రత్యామ్నాయంగా రాగి కూడా వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏఐ ఆధారిత డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్ అప్‌గ్రేడ్‌లు అన్నీ రాగిపై ఆధారపడి పనిచేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం తీవ్రమైన రాగి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని భారత ఆర్థిక సర్వే 2025-26 హెచ్చరించింది. రాగి ఇకపై కేవలం పారిశ్రామిక లోహం మాత్రమే కాదని, వ్యూహాత్మక వనరు అని సర్వే పేర్కొంది. దీంతో గత కొన్ని రోజులుగా దీని ధరలు బాగా పెరుగుతున్నందున, రాగిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

2 / 6
అయితే రాగి ధరలు భారీగా పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆర్థిక సర్వే వివరిస్తుంది. ముఖ్యంగా పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భారీ మౌలిక సదుపాయాలు అవసరం. ట్రాన్స్మిషన్ లైన్లు, కేబుల్స్, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, గ్రిడ్ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి పెద్ద మొత్తంలో రాగి అవసరం అవుతుంది. ఈ స్థాయిలో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, సరఫరా అదే రేటుతో పెరగడం లేదని సర్వే హెచ్చరిస్తుంది.

3 / 6
CNBC నివేదిక ఆధారంగా, 1 గిగావాట్ పవన విద్యుత్ సామర్థ్యాన్ని వ్యవస్థాపించడానికి దాదాపు 2,866 టన్నుల రాగి అవసరమని అంచనా వేసింది. అయితే రాగి వెలికితీత అనేది గతంలో కంటే ఇప్పుడు కష్టంగా మారిపోయింది. ప్రస్తుతం పనిచేస్తున్న గనుల్లో సగటు రాగి శాతం 0.5 నుండి 0.6 శాతం మాత్రమే ఉంది. కొత్త ప్రాజెక్టుల్లో ఇది 0.4 నుండి 0.5 శాతానికి తగ్గింది.

4 / 6
అంటే 1 టన్ను స్వచ్ఛమైన రాగిని పొందడానికి 167 నుండి 200 టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మనం సగటున 0.6 శాతం దిగుబడిని తీసుకుంటే, 2,866 టన్నుల రాగిని పొందడానికి దాదాపు 4.8 లక్షల టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని సర్వే వివరించింది.

5 / 6
ఈ గణాంకాలు రాగిని కలిగి ఉన్న ఖనిజానికి మాత్రమే సంబంధించినవని ఆర్థిక సర్వే పేర్కొంది. వాటిలో వ్యర్థ శిల, ఓవర్‌బర్డెన్, ప్రాసెసింగ్ నష్టాలు ఉండవు. వాస్తవానికి, గనిలో మొత్తం పదార్థ కదలిక సాధారణంగా రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్కన 1 GW పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం మొత్తం పదార్థ తరలింపు 1 మిలియన్ నుండి 2 మిలియన్ టన్నుల వరకు ఉండవచ్చని సూచిస్తుంది.

6 / 6
రాగి తవ్వకాలలో సకాలంలో పెట్టుబడులు పెట్టకపోయినా, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం లభించకపోయినా, రీసైక్లింగ్‌పై దృష్టి పెట్టకపోతే గ్రీన్ ఎనర్జీ పరివర్తన అడ్డంకులను ఎదుర్కొంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ప్రపంచ శక్తి పరివర్తన ఎంత త్వరగా జరుగుతుందో రాగి లభ్యత నిర్ణయిస్తుందని సర్వే స్పష్టం చేస్తోంది. రాబోయే దశాబ్దంలో, AI తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాల నుండి వచ్చే ఒత్తిడి రాగిని ఒక కీలకమైన లోహంగా మారుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో రాగి ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది.