సాధారణంగా ఏ వస్తువుకైనా ఎక్స్ పైరీ డేట్ ముగిస్తే.. పడేస్తాం. అలాగే వెనిగర్ కు కూడా ఎక్స్ పైరీ డేట్ అయిపోతే పడేస్తూ ఉంటారు. కానీ వెనిగర్ ను పడేయనవసరం లేదు. అవునా.. మరి ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా.. ఎక్స్ పైరీ డేట్ ముగిసిన తర్వాత ఆహారంలో ఉపయోగించాల్సిన అవసరం లేదు కానీ.. ఇంట్లో ఇతర అవసరాలకు వాడవచ్చు. మరి ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వెనిగర్ ను ఎలా ఉపయోగించు కోవచ్చు? దీంతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కోసారి ఇంట్లోని మొక్కల్లో పలు కీటకాలు, చీమలు గూడు కట్టుకుంటూ ఉంటాయి. దీంతో మట్టిని మొత్తం తవ్వేస్తాయి. దీంతో మొక్కలు చని పోయే ప్రమాదం ఉంది. అంతే కాదు చిరాగ్గా కూడా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఆ కీటకాలపై వెనిగర్ ను పిచికారీ చేయవచ్చు.
కొన్ని రకాల కీటకాలు మొక్కల ఆకులను తినేస్తూ ఉంటాయి. దీంతో మొక్క జీవిత కాలం త్వరగా ముగుస్తుంది. ఆ ఆకులపై వెనిగర్ ను చల్లితే ఆ కీటకలు నాశనం అవుతాయి. ఇంట్లో అద్దాలు, కిటికీలు వంటివి క్లీన్ చేసుకోవడంలో కూడా వెనిగర్ సహాయ పడుతుంది.
మైక్రోవేవ్ లను క్లీన్ చేయడానికి, బాగా జిడ్డు పట్టిన పాత్రలను ఈజీగా శుభ్రం చేయడానికి కూడా వెనిగర్ ను ఉపయోగించు కోవచ్చు. సింక్ ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్స్ పైరీ అయిపోయిన వెనిగర్ తో చేసుకోవచ్చు. అదే విధంగా ఇంట్లో కొన్ని జిడ్డు పట్టిన వస్తువులు క్లీన్ చేయడంలో కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది.
అంతే కాకుండా ఇంట్లో, కిచెన్ లో కింద ఒక్కోసారి ఆయిల్ పడి, ఇతర మరకలు కూడా పడుతూ ఉంటాయి. ఇవి అంత త్వరగా వదలవు. వాటిని వెనిగర్ తో క్లీన్ చేసుకోవచ్చు.