
సపోటా చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ, తియ్యగా రుచికరంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తారు. మన ఫుడ్ లో సపోటాను చేర్చుకోవడం వలన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్ పెడుతుంది: సపోటాలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటివి చికాకు నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. అంతే కాదు, కడుపు ఉబ్బరం , గ్యాస్ట్రిటిస్, ప్రేగు సమస్యలను కూడా తగ్గిస్తుంది.

జీర్ణక్రియ : జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడే వారు చాలా మంది ఉన్నారు. వారు ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేరు. మలబద్ధకం నుండి ఉపశమనం పొందాలంటే రోజుకొక సపోటా తినడం అలవాటు చేసుకోండి. అంతే కాదు, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.

బలమైన ఎముకలు: సపోటాలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. క్రమం తప్పకుండా వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. అంతే కాదు, కణజాల బలాన్ని కూడా సపోటా ప్రోత్సహిస్తుంది.

రోగనిరోధక శక్తి: సపోటాలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు ఉన్నాయి. విటమిన్ సి, ఎ, యాంటీఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వలన రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. అంతే కాదు, చర్మ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. .