
చలికాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సాధారణ సమస్యలు జలుబు, దగ్గు, శరీరం నీరసంగా మారడం. ఇలాంటి వారు తమ ఆహారంలో బెల్లం చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎలా అంటే బెల్లం శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచేందుకు సమాయపడుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం రోజూ కొద్ది మొత్తంలో బెల్లం తీసుకోవడం వల్ల జలుబు సమస్య తగ్గుతుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఉండే ఇనుము, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుండి రక్షించడంలో సహాయపడతాయి. శీతాకాలంలో తరచుగా అనారోగ్యానికి గురయ్యే వారు తమ రోజువారీ ఆహారంలో బెల్లం చేర్చుకుంటే వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.

చలికాలంలో చాలా మందిలో రక్త ప్రసరణ కాస్త మందగిస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. బెల్లంలో ఉండే పోషకాలు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి. ముఖ్యంగా భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది.

రక్తహీనతతో బాధపడేవారికి బెల్లం సహజ ఔషధంగా పనిచేస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే బెల్లంలో ఉండి ఖనిజాలు రక్తాన్ని శుద్ది చేసి శరీరంలోని విషాన్ని బటయకు పంపుతాయి. దీని కారణంగా చర్మానికి సహజ మెరుపువస్తుంది. మొటిమలు, నల్లటి మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా బెల్లం సహాయపడుతుంది.

అయితే బెల్లం తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానికి సరైన క్రమంలో తీసుకోకపోతే ప్రమాదమే. అవును ఒక వ్యక్తికి రోజుకు 10 నుండి 20 గ్రాముల బెల్లం సరిపోతుంది. బెల్లం నువ్వులు, వేరుశెనగలు లేదా అల్లంతో కలిపి తీసుకుంటే, దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. కానీ డయాబెటిక్ రోగులు బెల్లం తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. మొత్తంమీద, బెల్లం శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక దివ్వ ఔషదంగా పనిచేస్తుంది.