
ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంది. దాన్నో ఇంధనంలా భావిస్తాం. సమయానికి అది పడకపోతే, బండి ముందుకు కదలదు. అందుకే ఠంఛన్‌గా వేడివేడి టీ కప్పు వేళకు తాగాలని నిబంధన పెట్టుకుంటారు.

శరీరంలోని ఆల్కలైన్, యాసిడ్లు నిద్ర తరవాత కాస్త అసమతుల్యంగా ఉంటాయి. లేవగానే వేడి టీ తాగే అలవాటు వాటిని మరింత ప్రభావితం చేసి, జీవక్రియా రేటును తగ్గిస్తుంది. దీంతో దీర్ఘకాలంలో జీర్ణసంబంధిత సమస్యలు మొదలవుతాయి.

పైగా దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి, దంత సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఇలా వేడి వేడి టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రతికూలంగా పని చేస్తుంది. అనేక వ్యాధులకు దారితీస్తుంది.

ముఖ్యంగా చిన్న పిల్లలకు టీ అస్సలు ఇవ్వకూడదు. వేడి టీ తాగడం జీర్ణవ్యవస్థకు మరింత ప్రమాదకరం. ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి ఈరోజే వేడి టీ తాగే అలవాటు మానేయడం మంచిది. అలాగే భోజనం తర్వాత టీ తాగడం కూడా చాలా చెడ్డ అలవాటు. చాలా మంది భోజనం చేసిన వెంటనే టీ తాగుతారు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుంది. అయితే ఈ అలవాటు అంత మంచిది కాదు.