Iron Deficiency: రక్తహీనతను దూరం చేసే పండ్ల రసాలు ఇవే.. రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్‌ తాగారంటే

Updated on: Dec 05, 2023 | 7:39 PM

విటమిన్ ఎ నుంచి కాల్షియం వరకు.. అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అవసరం. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఐరన్‌ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్. ఇది ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. రక్తానికి ఎరుపు రంగును ఇస్తుంది. హిమోగ్లోబిన్ లోపం వల్ల మీ శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. పురుషుల కంటే మహిళలకు రక్తహీనత వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ..

1 / 5
విటమిన్ ఎ నుంచి కాల్షియం వరకు.. అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అవసరం. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఐరన్‌ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్. ఇది ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. రక్తానికి ఎరుపు రంగును ఇస్తుంది. హిమోగ్లోబిన్ లోపం వల్ల మీ శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది.

2 / 5
పురుషుల కంటే మహిళలకు రక్తహీనత వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడినప్పుడు చర్మం పాలిపోవడం, అలసట, శారీరక బలహీనత, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. శరీరంలో ఐరన్ లోపం తలెత్తితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడంలో సమస్య ఎదురవుతుంది. ఆహారం ద్వారా ఐరన్‌ లోపాన్ని నివారించవచ్చు. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడే పానియాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
శీతాకాలంలో ఉసిరి అందుబాటులో ఉంటుంది. రోజూ ఉదయాన్నే ఉసిరికాయ రసం తాగితే శరీరంలో విటమిన్ సి లోపం ఉండదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో బీట్‌రూట్ రసం తాగవచ్చు. బీట్‌రూట్‌లో ఐరన్‌తో సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని పూరించి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. మహిళలు తప్పనిసరిగా ఈ పానీయాన్ని తమ ఆహారంలో చేర్చుకోవాలి.

4 / 5
శరీరంలో ఐరన్ లోపాన్ని నివారించడంలో, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో దానిమ్మ రసం అత్యంత ప్రభావవంతమైనది. ఈ పండ్ల రసంలో ఐరన్‌తో పాటు విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి రక్తహీనత ప్రమాదాన్ని నివారించడానికి దానిమ్మ రసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.

5 / 5
వేసవిలో దాహం తీర్చే చెరకు రసం.. చలికాలంలో కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చెరకు రసంలో అధిక మొత్తంలో ఐరన్, ఇతర పోషకాలు ఉంటాయి. ఈ పానీయం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది.