ఇంతకు ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ (3195) మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ తరపున 3 వేల పరుగులు పూర్తి చేసింది. ఇప్పుడు ఈ ప్రత్యేక సాధకుల జాబితాలో స్మృతి మంధాన (3052) కూడా చేరిపోయింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన (54), షఫాలీ వర్మ (64) అర్ధ సెంచరీల సాయంతో టీమిండియా 17.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి శుభారంభం అందుకుంది.