Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ భక్తిని రెట్టింపు చేసే అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్రదేశాలను సందర్శించడం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవాన్ని మరింత స్పెషల్‌గా జరుపుకోవచ్చు.
ఆగష్టు 15వ తేదీకి అంటే స్వాతంత్ర్య దినోత్సవానికి చాలా రోజుల ముందు నుంచే సన్నాహకాలు మొదలవుతాయి. ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్స వేడుకలతో సందడి మొదలవుతుంది. ఒకవేళ మీరు కుటుంబంతో కలిసి ఏదైనా పర్యటనకు వెళ్లాలనుకుంటే.. ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు. వీటిని సందర్శించడం ద్వారా దేశంపై భక్తి భావన రెట్టింపు అవుతుంది.
వాఘా సరిహద్దు - అమృత్‌సర్ సమీపంలోని వాఘా సరిహద్దును సందర్శించవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని తలకించడం చాలా అద్భుతంగా ఉంటుంది. BSF సైనికులు, పాకిస్తాన్ రేంజర్ల మధ్య జరిగే షో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇండియా గేట్ - ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్‌ను సందర్శించవచ్చు. ఇక్కడి గోడలపై వీర అమరవీరుల పేర్లు చెక్కడం జరిగింది. దీంతోపాటు నేషనల్ వార్ మెమోరియల్‌ను కూడా సందర్శించవచ్చు. వీర జవాన్ల గౌరవార్థం దీన్ని ఏర్పాటు చేశారు.
పోర్ బందర్ - గుజరాత్‌లో ఉన్న పోర్ బందర్‌ను కూడా సందర్శించవచ్చు. ఇది జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. ఇక్కడ మహాత్మా గాంధీ జన్మస్థలం, ఘుమ్లీ, పోర్ బందర్ బర్డ్ శాంక్చురీ, పోర్ బందర్ బీచ్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
ఎర్రకోట - ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారాల నుండి భారత ప్రధాన మంత్రి ప్రసంగం చేస్తారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడానికి, వీక్షించడానికి కూడా ఇక్కడకు వెళ్లవచ్చు. ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావచ్చు.