Raw Milk For Skin: పచ్చిపాలతో మెరిసే అందం.. ఇలా సాధ్యం..! పైసా ఖర్చులేకుండా..

|

Oct 09, 2024 | 8:45 PM

ముఖం కాంతివంతంగా, యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక. ఇక అమ్మాయిలైతే అందం కోసం ఎక్కువగా ఆరాటపడుతుంటారు. అందుకోసం ఖరీదైన ఫేస్ క్రీములు, బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇలాంటి పరిష్కారాలతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇంట్లో ఈజీగా లభించే పచ్చి పాలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయని చెబుతున్నారు. పచ్చిపాలతో సహాజ సౌందర్యం ఎలా పొందవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
పచ్చిపాలు మీ స్కిన్‌పై టోనర్‌గా పనిచేస్తాయి. ఇందుకోసం రాత్రి పడుకునేటప్పుడు చర్మానికి పచ్చిపాలని అప్లై చేయాలి. దీని వల్ల స్కిన్ బిగుతుగా మారుతుంది. పచ్చిపాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మ లోపలి భాగాన్ని క్లీన్ చేయడమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది.

2 / 6
ఇందుకోసం ఒక గిన్నెలో పచ్చిపాలు తీసుకోవాలి. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది డెడ్ స్కిన్ ను శుభ్రపరుస్తుంది. మృతకణాలు తొలగించి చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇస్తుంది. ముఖం కాంతివంతంగా మారుస్తుంది.

3 / 6
మీ ముఖాన్ని క్లీన్ చేసేందుకు పచ్చిపాలని ఉపయోగించడం వల్ల మీ ముఖంలో మంచి గ్లోని చూస్తారు.. ఇది మీ ముఖంపై పేరుకుపోయిన మురికిని పోగొట్టడమే కాకుండా, సహజ తేమని అలానే ఉండేలా చేస్తుంది. ఇది చర్మానికి పోషణ, తేమని అందిస్తుంది. మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా కాపాడుతుంది.

4 / 6
సున్నితమైన చర్మం, పొడి చర్మం ఉన్నవారిలో మృదువుగా మారాలి అంటే పచ్చిపాలు, తేనె బెస్ట్‌ టిప్‌గా పనిచేస్తుంది. ఈ రెండింటిని బాగా మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం మృదువుగా మారుతుంది.

5 / 6
ఎండవేడి కారణంగా వచ్చే టాన్‌, పిగ్మేంటేషన్‌ వంటి సమస్యలను పచ్చిపాలతో అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా పాలతో చర్మం ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మ ఛాయను పెంచటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

6 / 6
చర్మం పొడి బారితే దీనికి పచ్చి పాలు చక్కని పరిష్కారం చూపుతుంది. పచ్చి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె వేసి, చర్మానికి పట్టించి 30 నిమిషాలపాటు వదిలేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మానికి తగినంత తేమ అంది, పొడిబారడం తగ్గుతుంది.