
తీపి అంటే చిన్న వారి నుంచి పెద్దవారి దాకా అందరికీ ఇష్టమే. అందులోనూ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే.. ఎక్కువగా పంచదార తింటూ ఉంటారు. చక్కెర నోటికి తియ్యగానే ఉన్నా.. వచ్చే అనారోగ్య సమస్యలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. మరి చక్కెరను ఎలా తీసుకోవాలి? తక్కువగా తీసుకుంటే ఏం లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

పంచదార తక్కువగా తీసుకోవడం వల్ల.. లివర్‌కి చాలా మంచిది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. చక్కెర తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్ రాకుండా ఉంటుంది. పంచదార ఎక్కువగా తీసుకుంటే ప్రీ డయాబెటిస్, టైప్ - 2 డయాబెటీస్ రావచ్చు.

పంచదార తక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు రావు. చక్కెరలో చర్మ సమస్యలకి కారణం అయ్యే గుణాలు ఉన్నాయి. దీంతో చర్మం జిడ్డుగా మారి, మొటిమలు కూడా వస్తాయి. అదే విధంగా బరువు కూడా కంట్రోల్ అవుతారు. చక్కెర తింటే మరింత ఆకలి వేస్తుంది. అలా బరువు పెరుగుతారు.

Sugar

పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పాడైపోతాయి. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు వస్తాయి. కాబట్టి చక్కెరను తక్కువగా తీసుకుంటే.. దంత ఆరోగ్యం పెరుగుతుంది. మెదడు కూడా యాక్టీవ్‌గా పని చేస్తుంది.