Health Tips: చలికి వణికిపోతున్నారా.? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నాయేమో తెలుసుకోండి.!

|

Nov 19, 2021 | 5:16 PM

శీతాకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే చలి తీవ్రత కూడా క్రమేపీ పెరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలో ఆరోగ్యంపై..

1 / 6
 శీతాకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే చలి తీవ్రత కూడా క్రమేపీ పెరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. వ్యాధుల బారిన పడకుండా, చలి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలందరూ ఈ సీజన్‌లో వెచ్చని దుస్తులను ధరిస్తారు. అయితే మీరెప్పుడైనా చలికి విపరీతంగా వణికిపోతే.. అది ఏదైనా వ్యాధికి సంకేతం అని గుర్తించాలి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
విటమిన్ సి, బి-12 లోపం - శరీరానికి విటమిన్స్, ఖనిజాలు చాలా అవసరం. ఇందులో ఏది మిస్సయినా.. లోపం ఏర్పడుతుంది. అప్పుడు మన శరీరం వ్యాధిని తట్టుకోగలిగే సామర్ధ్యాన్ని కోల్పోతుంది. తద్వారా మనం ఇతరుల కంటే ఎక్కువగా వణికిపోతాం. ఇదే పరిస్థితిని మీరు రెండు లేదా మూడు రోజుల నుంచి అనుభవిస్తుంటే.. తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకుని.. డాక్టర్‌ను సంప్రదించండి.

3 / 6
థైరాయిడ్ - థైరాయిడ్ అనేది మీ హార్ట్ రేట్, జీవక్రియ రేటుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. థైరాక్సిన్ హార్మోన్‌ ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు మీ జీవక్రియ రేటు తగ్గుతుంది. దీని వల్ల మీరు అధికంగా వణుకుతారు. ఒకవేళ ఇదే పరిస్థితి మీకు అనిపిస్తే.. వెంటనే మీ థైరాయిడ్‌ని చెక్ చేసుకోండి.

4 / 6
మధుమేహం- డయాబెటిక్స్ వ్యాధి మీ మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ, బాడీ టెంపరేచర్‌పై కూడా ప్రభావం ఉంటుంది. మీకు చలితో పాటు ఎక్కువగా ఆకలి వేస్తుంటే.. లేదా మూత్ర విసర్జనకు సంబంధించి అనేక సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

5 / 6
ఆరోగ్యం క్షీణించడం- శీతాకాలంలో చాలామంది అనేక రోగాల బారిన పడుతుంటారు. మీ ఆరోగ్యం క్షీణించినప్పుడు.. మీరు ఖచ్చితంగా చలికి వణికిపోతారు. ఇలాంటి పరిస్థితి మీకు విశ్రాంతి చాలా అవసరం. ఒకవేళ అప్పటికీ మీ ఆరోగ్యం మాములు స్థితికి రాకపోతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

6 / 6
రక్తహీనత - ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులలో ఎర్ర రక్త కణాల కొరత ఏర్పడుతుంది. అలసట కలగడం, అలాగే చలి వేస్తుండటం.. ఈ వ్యాధి లక్షణాలు. దీనిని ఐరన్ డెఫిషియన్సీ అని కూడా అంటారు. అలాగే రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు కూడా చలి వేస్తుంది. ఒకవేళ అలా అనిపిస్తే మీరు మీ బ్లడ్ ప్రెజర్, రక్తహీనత పరీక్షలను చేయించుకోవాలి.