- Telugu News Photo Gallery If you don't see the sunrise in those places, it's a waste of life, go for sure.
ఆ ప్రదేశాల్లో సూర్యోదయం చూడకుంటే.. లైఫ్ వేస్ట్.. పక్కాగా వెళ్ళండి..
ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఏదైనా రిసార్ట్ లో ఎంజాయ్ చేసి ఉదయాన్నే సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తే సూపర్ కదా. కానీ సూర్యోదయాన్ని ఎక్కడ నుంచి చూస్తే బాగుంటుందనేది పెద్దగా ఎవ్వరికీ తెలియదు. సో అలాంటి వారి కోసమే సూర్యోదయంటే బాగుండే ప్లేస్ లను మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేద్దాం.
Updated on: Oct 14, 2025 | 2:47 PM

టైగర్ హిల్, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లో ఉన్న కాంచన్ జంగా పర్వతాల వద్ద ఉన్న టైగర్ హిల్ పర్యాటకులకు సూర్యోదయ వీక్షణ అనుభూతినిస్తుంది. ఇది ఎంతో అందంగా, ఆహ్లదకరంగా ఉంటుంది.

కన్యాకుమారి, తమిళనాడు: తమిళనాడు కన్యాకుమారి ప్రాంతంలో అరెబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిస్తాయి. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షిస్తే మధురానుభూతి కలుగుతుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.

నంది హిల్స్, కర్ణాటక: కర్ణాటకలోని నంది హిల్స్ లో మొదటి సూర్యోదయాన్ని చూస్తే ఆ ఫీలింగ్ మాటాల్లో చెప్పలేమని పర్యాటకుల అభిప్రాయం. ఇక్కడ సూర్యదయాన్ని చూడటానికి అనేక ప్రాంతాల ప్రజలు తరలివస్తారు.

ఉమియం సరస్సు, మేఘాలయ: షిల్లాంగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉమియం సరస్సు వద్ద కొండల మధ్య నుంచి సూర్యోదయాన్ని వీక్షిస్తే ఆ అనుభూతే వేరు. ఇది చాల అందంగా, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది.

కోవలం బీచ్, కేరళ: మనలో చాలా మంది విహారయాత్రలకు కేరళ వెళ్తుంటారు. అలాంటి వారు వీలు కుదిరతే కోవలం బీచ్ ను సందర్శిస్తే ఉదయం అక్కడ సూర్యోదయ వీక్షణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

ముంబై పాయింట్, మహాబలేశ్వర్: ప్రతి చోట సూర్యోదయాన్ని చూసి ఆనందిస్తే ఈ ప్రదేశంలో మాత్రం సూర్యాస్తమయాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. మహాబలేశ్వర్ లోని పాత బొంబై రోడ్ లో ముంబై పాయింట్ నుంచి ప్రజలు వివిధ కోణాల సూర్యాస్తమయం వీక్షించడానికి వస్తూ ఉంటారు.




