Hyderabad Rains: మూసీకి పెరుగుతున్న వరద ఉధృతి.. మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్ చేసిన అధికారులు..
హైదరాబాద్ నగరం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం మొత్తం అతలకుతలం అయిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు మూసీకి వరద పోటెత్తడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. ఛాదర్ ఘాట్, మూసీ లో లెవల్ బ్రిడ్జ్‌లను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది.

Moosarambagh Bridge
- హైదరాబాద్ నగరం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం మొత్తం అతలకుతలం అయిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు మూసీకి వరద పోటెత్తడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. ఛాదర్ ఘాట్, మూసీ లో లెవల్ బ్రిడ్జ్‌లను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది.
- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మూసి నదికి వరద పోటెత్తుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు గ్రామం వద్ద ‘లో’ లెవల్ వంతెనపై నుంచి మూసినది ఉదృతంగా ప్రవహిస్తోంది.
- దాంతో.. పోలీసులు వంతెన ఇరువైపులా భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బీబీనగర్-భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఇక.. భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
- మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల బాధ వర్ణనాతీతంగా మారుతోంది. భారీ వరద ఉధృతితో మూసీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వంతెనను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది.
- ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటూ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన బల్దియా మూసీ పరివాహక ప్రాంతాలు అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేసింది. ముందు జాగ్రత్తగా.. మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు.